Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణకు కారణం వాళ్లే.. జై శంకర్ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ లో దాదాపు 200 మందికి పైగా మృతి చెందినట్లు భారత రక్షణశాఖ ఇటీవల పేర్కొంది. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జర్మన్ డైలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ తనదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు కారణం భారత త్రివిధ దళాలు అని జై శంకర్ తెలిపారు. భారత త్రివిధ దళాల ధాటిని తట్టుకోలేక పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమీ లేదన్నారు.

భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు ఈ క్రెడిట్ దక్కుతుందని అమెరికాకు కాదని జై శంకర్ తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాకు థ్యాంక్స్ చెబుతారా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. " కాల్పుల విరమణకు ఇరు దేశాల ప్రతినిధులు డైరెక్ట్ గా మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందురోజు పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో వారికి తీరని నష్టం వాటిల్లింది. దీంతో ఆ దేశం ఒప్పందానికి వచ్చింది. ఇందులో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే భారత త్రివిధ దళాలకు చెబుతా. వారి పోరాట ప్రతిమ వల్లే పాకిస్థాన్ తల వంచింది" అని విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.

Jaishankar Credit for India-Pakistan Ceasefire Belongs to Indian Armed Forces Not the US

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మే 07న ప్రారంభమై మే 11 వరకు జరిగింది. మే 10న భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన ఏర్పడినా.. మళ్లీ కొద్దిసేపటికే పాక్ తన వక్ర బుద్దిని చాటింది. ఆ రాత్రి మరోసారి డ్రోన్ లతో సరిహద్దు రాష్ట్రాలపై దాడికి పాల్పడింది. కానీ వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+