Jammu Kashmir‌కు మళ్లీ రాష్ట్ర హోదా -స్పష్టం చేసిన మోదీ సర్కార్ -యూటీలో టెర్రరిజం తగ్గిందట

జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేత సందర్భంలో అది కోల్పోయిన రాష్ట్ర హోదా తిరిగి దక్కడం ఖాయమైపోయింది. ప్రస్తుతం అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని బీజేపీ నేతలు హామీ లివ్వడమే తప్ప, ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత తొలిసారి కేంద్రం అధికారికంగా దీనిపై క్లారిటీ ఇచ్చింది.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని, అయితే, అక్కడ పరిస్థితులన్నీ సాధారణ స్థాయికి చేరిన వెంటనే ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర రాష్ట్ర హోదా, అక్కడ ఉగ్రవాద సమస్యలపై పార్లమెంటులో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ బుధవారం లిఖితపూర్వక సమాధానాలిచ్చింది.

 Jammu Kashmir statehood will be restored after normalcy, terrorism reduced: Home Ministry

కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి రాష్ట్ర హోదాను కల్పిస్తామన్న కేంద్రం.. తమ పాలనలోనే అక్కడ టెర్రరిజం తగ్గినట్లు చెప్పుకుంది. 2020లో 59 శాతంగా ఉన్న ఉగ్రవాద కలాపాలు 2021కు వచ్చేసిరికి 32 శాతానికి పడిపోయిందని హోం శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్రం అమలు చేస్తున్నదని, కాశ్మీర్ లో అన్ని వర్గాల మద్దతుతో ప్రక్రియ ముందుకు సాగుతున్నదని హోం శాఖ పేర్కొంది. టెర్రరిజం తగ్గిందని కేంద్రం చెబుతున్నా, ఇటీవల డ్రోన్ దాడులు తీవ్రతరం కావడం కలకలం రేపుతున్నది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గత నెల 24న జమ్మూకాశ్మీర్ లోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేవం జరగడం తెలిసిందే. ఆ రోజే ప్రధాని స్వయంగా రాష్ట్ర హోదా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా, ఇదే డిమాండ్ ను పార్టీలన్నీ కేంద్రం ముందుంచాయి. ఆర్టికల్ 370 ఎత్తివేత సందర్భంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు హామీ లభించినా, గడిచిన రెండేళ్లుగా కాశ్మీర్ దాదాపు సైనిక నియంత్రణలోనే కొనసాగుతుండటంతో అన్ని వర్గాల ఆశలు అడుగంటాయి. గత నెలలో జరిగిన అఖిలపక్ష భేటీతో మళ్లీ కదలిక మొదలై, ఇవాళ్టి క్లారిటీతో జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు స్పష్టమైపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+