జన్ ధన్ షాకింగ్: నిన్న అలా, నేడు ఇలా.. 15 రోజుల్లో రూ.3,285 కోట్లు

గత రెండు వారాలుగా జన్ ధన్‌ ఖాతాల నుంచి రూ.3,285 కోట్లను ప్రజలు విత్ డ్రా చేసుకున్నట్లుగా తేలింది.

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత జన్ ధన్‌ యోజన ఖాతాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా నవంబర్‌ 8 తర్వాత ఆ ఖాతాల్లో జమ అవుతున్న నగదు అమాంతం పెరిగిపోయింది.

 Jan Dhan account holders withdrew Rs 3285cr in last fortnight

కాగా గత రెండు వారాలుగా జన్ ధన్‌ ఖాతాల నుంచి రూ.3,285 కోట్లను ప్రజలు విత్ డ్రా చేసుకున్నట్లుగా తేలింది. డిసెంబర్‌ 7 నాటికి జన్ ధన్‌ ఖాతాల్లో 74,610 కోట్లు జమ అయ్యాయి. ఆ తర్వాత నగదు ఉపసంహరణలు పెరుగుతూ వచ్చాయని వెల్లడయింది.

గత పదిహేను రోజులలోనే రూ.3,285 కోట్లు విత్ డ్రా చేసుకున్నట్లుగా తేలింది. జన్ ధన్‌ ఖాతాల్లో రూ.50వేలకు మించి డిపాజిట్‌ చేసే అవకాశం లేదు. అంతేకాకుండా నెలకు కేవలం రూ.10వేలు మాత్రమే నగదు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం నిబంధన విధించింది.

అయినా అంత మొత్తంలో నగదు విత్ డ్రా జరిగిదంటే ఆయా ఖాతాలను దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు. నవంబర్‌ 9 నాటికి 25.5 కోట్ల జన్ ధన్‌ ఖాతాల్లో రూ.45,636.61 కోట్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+