ప్రేమించిన యువతినే పెళ్లిచేసుకొన్న టెక్కీ, ఆత్మహత్య చేసుకొన్న తల్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఓ తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.అయితే తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకొని ఇంటికి వచ్చిన ఆ యువకుడికి తల్లి శవం కన్పించింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అన్నానగర్ లోని తేని ప్రాంతానికి చెందిన జయభారతి రిటైర్డ్ టీచర్. ఆమె భర్త సుబ్బరాజ్ కొంతకాలం క్రితమే చనిపోయాడు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.అయితే కుమార్తె వివాహమైంది. అయితే కుమారుడు మాత్రం తన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొన్న జయభారతి అభ్యంతరం తెలిపింది.

కానీ, తల్లి మాటను లెక్కచేయకుండానే గత నెల 12వ, తేదిన మనోజ్ ప్రేమించిన అమ్మాయిని చెన్నైలో వివాహం చేసుకొన్నాడు. వివాహం జరిగిన తర్వాత భార్యను తీసుకొని మంగళవారం నాడు ఉదయం తేని ప్రాంతంలో తల్లివద్దకు వచ్చాడు.

Jayabharathi suicide in Tamilnadu state

అయితే తలుపు లోపల గడియపెట్టి ఉంది,. మనోజ్ ఎంతకొట్టినా తలుపుతెరవలేదు. అంతేకాదు లోపలనుండి దుర్వాసన వస్తోంది. మనోజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే తలుపులు పగులగొట్టి చూస్తే జయభారతి ఉరివేసుకొని కన్పించింది.

మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో ఆమె పదిరోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jayabharathi, retired teacher suicide in Tamilnadu state on Tuesday.She has not accept her son's love , but manoj married her lover.
Please Wait while comments are loading...