• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయ స్టార్ హీరోయిన్: స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది ఎందుకంటే ?

|

మైసూరు/చెన్నై: బహుబాష నటిగా అగ్రస్థానంలో ఉన్న జయలలిత ఒక సారి ఓ ఆడిటోరియంలో అందరి ముందు భరతనాట్యం చెయ్యవలసిన పరిస్థితి ఎదురైయ్యింది. అయితే ఎదో ఉల్లాసంగా మాత్రం కాదు.

ఆ భారతనాట్యం చూడాంటే కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చెయ్యాలని ప్రకటనలు కూడా ఇచ్చారు. సినిమా హీరోయిన్ గా అగ్రస్థానంలో ఉన్న జయలలితకు ఏంటీ ఈ కష్టాలు అనుకుంటున్నారా ? అయితే పిల్లల కష్టాలు తీర్చడానికి అప్పట్లోనే ఆమె స్టేజ్ షోలు చేశారు.

ఆమె మనస్సు వెన్న అని అప్పుడే నిరూపించుకున్నారు. ప్రస్తుతం మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకా, మేలుకోటేలో జన్మించిన జయలలిత తండ్రి జయరామ్ మైసూరు మహారాజులతో సన్నిహితంగా ఉండే వారు.

మైసూరు మహారాజులు నిర్మించిన మైసూరులోని కేఆర్ చెలువాంబ ఆసుపత్రిలో 1948 ఫిబ్రవరి 5వ తేదిన జయలలిత జన్మించారు. జయలలిత తండ్రి జయరామ్ కు అప్పట్లో మైసూరులోని లక్ష్మిపురం, సరస్వతీపురంలో ఇండ్లు ఉండేవి.

Jayalalitha is one of India's most colourful personality who was classical dancer

జయలలితకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కథక్, మోహిణియట్టం, మణిపురి నృత్యాలలో ప్రవీణ్యం ఉంది. తల్లి ఒత్తిడి మేరకు జయలలిత 14 ఏళ్ల వయస్సులో కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు.

15 ఏళ్ల వయస్సులో కథానాయికిగా రంగప్రవేశం చేశారు. 1965 లో అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ పక్కన నటించిన జయలలిత తరువాత వెనక్కితిరిగి చూసుకోలేదు. అయితే ఆమె అగ్ర కథానాయికిగా వెలుగుతున్న సమయంలో ఆమె దగ్గరకు మైసూరుకు చెందిన కొందరు వెళ్లారు.

జయలలిత ఏమిటీ ఇలా వచ్చారు అని ప్రశ్నించడంతో వారు మీరు స్టేజ్ మీదకు వచ్చి భరతనాట్యం చెయ్యాలని చెప్పడంతో అందరూ షాక్ కు గురైనారు. అయితే జయలలిత మాత్రం కూల్ గా సరే అని చెప్పడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

వెంటనే తిరిగి వెళ్లిన వారు మైసూరులోని క్రాఫర్డ్ హాల్ లో భరతనాట్య నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. 19.03.1967 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రముఖ సినీ తార జయలలిత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశామని ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లోనే ప్రవేశ రుసుంగా రూ. 50, రూ. 25, రూ. 10 టిక్కట్ల ధరలు పెట్టారు. చాల మంది టిక్కెట్లు తీసుకున్నారు. అదే రోజు జయలలిత క్రాఫర్ట్ హాల్ నృత్యం చేశారు. తరువాత అక్కడి నుంచి మద్రాసు వెళ్లిపోయారు.

స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో నీవు ఇలాంటి స్టేజ్ షోలు ఇవ్వడం ఏమిటీ ? అని సినీరంగంలోని చాల మంది జయలలితను ప్రశ్నించారు. అప్పుడు జయలలిత అసలు విషయం చెప్పారు.

మైసూరు సమీపంలోని శ్రీరంగపట్టణం తాలుకా నగువినహళ్ళి (నవ్వుల పల్లి)లో ప్రాథమిక పాఠశాల నిర్మించడానికి డబ్బులు లేకపోవడంతో వారు మైసూరులో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి వచ్చిన డబ్బులో స్కూల్ నిర్మించుకుంటామని తనకు చెప్పారని జయలలిత వివరించారు.

ఆ నృత్య ప్రదర్శనలో వచ్చిన సొమ్ముతో ఆ గ్రామంలో స్కూల్ నిర్మించారు. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. మంగళవారం ఆ స్కూల్ లో జయలలితకు నివాళులు అర్పించారు. అదే స్కూల్ చదవిన అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు. అప్పట్లోనే జయలలితకు ఇతరులకు సహాయం చెయ్యాలనే ఆలోచన ఉండేదని నగువినహళ్ళి గ్రామస్తులు చెప్పారు.

English summary
Jayaram Jayalalitha is one of India's most colourful personality who was classical dancer turned Actress and then a successful politician. has served as the chief minister of south India's Tamil Nadu state on numerous occasions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X