• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విప్లవ నేత: జయ రాజకీయ జర్నీలో పూలూ ముళ్లూ...

By Pratap
|

చెన్నై: సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జయలలిత సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి స్థాయికి ఎదిగారు. తమిళనాడు రాష్ట్రంలో ఆమె అశేష జనాదరణ పొందారు. దాదాపు 11 కేసులు ఆమెపై నమోదైనప్పటికీ ఆమెపై ఉన్న ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేద.

ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు ఆమె జన్మించారు.. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి.

అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించారు.

పురచ్చితలైవిగా పేరు

పురచ్చితలైవిగా పేరు

అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు. ఎంజి రామచంద్రన్ మరణానంతరం ఆయన భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అయియతే ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయారు.

తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా...

తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా...

జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.ప్రజలచే ఎన్నికైన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా ఆమె అవతరించారు. తమిళ ప్రజలు ఆమెను రాజకీయాల్లో ఎంజిఆర్ వారసురాలిగా స్వీకరించారు.

ఓటమి కూడా ఆమెకు తప్పలేదు..

ఓటమి కూడా ఆమెకు తప్పలేదు..

ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. ఆమె పార్టికి కేవలం నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు.

బలవంతంగా సినీ రంగ ప్రవేశం

బలవంతంగా సినీ రంగ ప్రవేశం

కుటుంబ పరిస్థితుల వల్ల తన తల్లి బలవంతంతో తన 15వ యేట సినిమా రంగంలో ప్రవేశించారు. పలు తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఆమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతున్నారు.

ఇదీ జయ రాజకీయ ప్రయాణం

ఇదీ జయ రాజకీయ ప్రయాణం

* 1988 లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు
* 1989 గెలుపు,
* 1991 గెలుపు.
* 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి పాలు
* 2001 గెలుపు
* 2001 లో అత్యధిక మెజారిటీతో విజయం.
* 2006 లో ఓటమి.
* 2011 లో తిరుగులేని ఎన్నిక.
* 2016 లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

ఎంజిఆర్ వారసురాలిగా జయ..

ఎంజిఆర్ వారసురాలిగా జయ..

జయలలిత నటిగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎంజి రామచంద్రన్ సరసన ఎన్నో చిత్రాలలో నటించారు. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నారు.

ఆస్తుల కేసులో అరెస్టు

ఆస్తుల కేసులో అరెస్టు

2104 సెప్టెంబరు 27వ తేదీన జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది. మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా వదిలిపెట్టారు. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

English summary
Tamil Nadu CM Jayalalithaa in her Tamil nadu political journey faced several problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X