ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధం: జయకు హార్ట్ అసిస్ట్ పరికరంతో ప్రత్యేక చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గుండెనొప్పుతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గుండెనొప్పుతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను మోహరించారు. సోమవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు యూనిఫాంలో డ్యూటీకి అటెండ్ కావాలని ఆదేశాలు వెళ్లాయి. పారామిలిటరీ, ఆర్మీ రంగంలోకి దిగింది. జయ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కార్యకర్తలు, అభిమానులు ఆందోళన, అలజడి రేపుతున్నాయి. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

jayalalithaa

హార్ట్ అసిస్ట్ పరికరంతో చికిత్స

జయలలిత ఆరోగ్యాన్ని 8 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా చెన్నై బయలుదేరారు. ప్రస్తుతం జయలలితకు హార్ట్ అసిస్ట్ డివైస్ ద్వారా ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. క్రిటికల్ కేర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో జయలలిత చికిత్స పొందుతున్నారు.

గతంలో చెన్నై వచ్చి జయలలితకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్ బాలేతోను అపోలో బృందం ఎప్పటికి అప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అపోలో కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులతో డాక్టర్ రిచర్డ్ బాలే మాట్లాడుతున్నారు.

ఆదివారం అమ్మకు గుండెపోటు వచ్చిందని తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తరలి వస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద కేంద్ర, పారామిలిటరీ బలగాలను మోహరించారు.

మరోవైపు చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్సులో పోలీసు సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. అపోలో ఆసుపత్రి వద్ద, రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తీసుకునే చర్యలపై చర్చించారు. ఆసుపత్రి పరిసరాల్లోని హోటల్స్, రెస్టారెంటులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర రావు సీనియర్ మంత్రులతో చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+