బయటకు పంపేందుకే..: శశికళకు పన్నీరు 'పోయెస్ గార్డెన్' ఝలక్
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్‌లు శశికళ ఉంటున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జయలలిత నివాసం ఉన్న పోయెస్ గార్డెన్‌లు శశికళ ఉంటున్నారు. అయితే, ఆ నివాసాన్ని అమ్మ మెమోరియల్‌గా చేయాలని పన్నీరు భావిస్తున్నారు.
పదవుల కోసం, ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం - శశికళ మధ్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఇందులో భాగంగా శశికళకు షాకిచ్చేందుకు పోయెస్ గార్డెన్‌ను అమ్మ మెమోరియల్‌గా మార్చాలని నిర్ణయించారు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోయెస్ గార్డెన్‌ను అమ్మ మెమోరియల్‌గా మారిస్తే.. ప్రస్తుతం అందులో ఉంటున్న శశికళ బయటకు వెళ్లివలసి ఉంటుంది.

కాగా, అన్నాడీఎంకే పార్టీకి తానే కోశాధికారినని, తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాల్లోని డబ్బు తీసుకోవడానికి అనుమతి లేదని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంతకుముందు స్పష్టం
చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆయనను కోశాధికారి పదవి నుంచి తొలగించారు. అయితే పార్టీ నిబంధనల ప్రకారం తన తొలగింపు అక్రమమని, తాను ఇంకా పార్టీ కోశాధికారినని పన్నీర్ పేర్కొన్నారు.
తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాల్లో నిధులు వాడడానికి ఎవరినీ అనుమతించొద్దని కరూర్ వైశ్యా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లకు లేఖలు పంపించారు. మరోవైపు, నేడు ఇరు పక్షాల బలనిరూపణ జరిగితేనే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశముంది.












Click it and Unblock the Notifications