జయలలిత వారసుడు అజిత్ ? నేడు ఆసుపత్రికి !
జయలలితకు నమ్మినబంటు, తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వం ప్రస్తుతం అమ్మకు సంబంధించిన అన్ని శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అమ్మ తరువాత అన్నాడీఎంకే పార్టీ నాయకుడు ఎవరూ ? అనే విషయం తెరమీదకు వచ్చింది. జయలలితకు నమ్మినబంటు, తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వం ప్రస్తుతం అమ్మకు సంబంధించిన అన్ని శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారు.
అయితే తమిళనాడులో కొన్నేళ్లుగా నువ్వా ? నేనా ? అంటూ రాజకీయంగా కత్తులు నూరుతున్న అన్నాడీఎంకే, డీఎంకేలో పచ్చగడ్డి వేస్తు మండిపోతుంది. ఇప్పటి వరకు జయలలిత అన్నాడీఎంకేలో తిరుగులేని నాయకురాలిగా ఒక వెలుగు వెలిగారు.

కరుణానిధి కుటుంబ సభ్యులను ఎదుర్కొనే సత్తా ఇప్పుడు పన్నీరు సెల్వంకు ఉందా ? అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పన్నీరు సెల్వం కంటే సీనియర్లు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. జయలలితకు కుమారుడు లాంటి వాడు, తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుని, మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్ ను తెరమీదకు తీసుకురావడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం లేదా రాత్రి అజిత్ అపోలో ఆసుపత్రికి వస్తున్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. సోమవారం అన్నాడీఎంకే శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అజిత్ పేరు చర్చకు వచ్చిందని సమాచారం. అయితే అజిత్ ఆసుపత్రి దగ్గరకు ఎప్పుడు వస్తారు ? అనే విషయంపై అన్నాడీఎంకే మంత్రులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం కంటే పార్టీలో సీనియర్లుగా ఉన్న కొందరు నాయకులు అజిత్ ను తమ నాయకుడిగా ప్రకటించాలని భావిస్తున్నారని తెలిసింది. అయితే తోందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని వేచి చూస్తున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications