అధికారం అడ్డం పెట్టుకుని డీసీఎం, మంత్రి ఏం చేశారంటే ?, ఎన్నికల నియమాలు గాలికి వదిలేసి ?
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి మధు బంగారప్పపై ఎన్నికల అధికారుల కార్యాలయంలో జేడీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బెంగళూరు టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రామనగర్, బెంగళూరు రూరల్ జిల్లా, బెంగళూరు అర్బన్ జిల్లా డీడీపీఐ, బీఈవోలతో కలిసి డీకే శివకుమార్, మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని జేడీఎస్ నేతలు చీఫ్ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు చేశారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి మధు బంగారప్ప, కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేలా ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఎన్నికల ప్రధాన అధికారికి జేడీఎస్ నాయకుల నుంచి ఫిర్యాదులు అందాయి. బెంగళూరు టీచర్స్ ఎమ్మెల్సీ నియోజక వర్గంలోకి రామనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు సిటీ జిల్లాలు వస్తాయి.

ఈ మూడు జిల్లాల డీడీపీఐలు, బీఈవోలు 3 జిల్లాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కర్ణాటక ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి శివకుమార్, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప రహస్యంగా సమావేశం నిర్వహించారని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. సమావేశం ముసుగులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల అంశానికి సంబంధించి కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప బెంగళూరు నగరంలోని కేఆర్ సర్కిల్ లో రహస్య సమావేశం నిర్వహించారని ఎన్నికల కమీషన్ కు జేడీఎస్ ఫిర్యాదు చేసింది.
మూడు జిల్లాల డీడీపీఐలు, బీఈఓలను పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పతో పాటు డీకే శివకుమార్ ఉన్నారని, ఈ సందర్బంగా కాంగ్రెస్ అభ్యర్థి పుట్టన్నకు ఓటు వేయాలని ఒత్తిడి చేశారని జేడీఎస్ ఆరోపిస్తోంది. బెంగళూరు సిటీ నార్త్, సౌత్, రామనగర జిల్లా, బెంగళూరు రూరల్ జిల్లా డీడీపీఐ, బీఓలను విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులను రాత్రి 7 గంటలకు తన ఇంటికి పిలిపించి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడుతూ డీకే శివకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని జేడీఎస్ ఆరోపించింది.

కర్ణాటక ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని పరోక్షంగా విద్యావంతులైన ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇది మోడల్ ప్రవర్తనా నియమావళికి స్పష్టమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందువలన ఇలంటి సభలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని, ఎన్నికల అక్రమాలు జరగకుండా చూడాలని జేడీఎస్ డిమాండ్ చేసింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications