• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రంక్ అండ్ డ్రైవ్ కు భ‌య‌ప‌డి మెట్రో ఎక్కే వారికి ఝ‌ల‌క్....! 18 ల‌క్ష‌ల జ‌రిమానా..!!

|
  OMG ! Metro Passengers Be Careful ! | Oneindia Telugu

  దిల్లీ/ హైద‌రాబాద్ : కాదేదీ జ‌ర‌మానాకు అన‌ర్హం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేష‌న్ అదికారులు. సాధార‌ణంగా తాగి డ్రైవ్ చేస్తే పోలీసుల‌తో ఎందుకులే చికాక‌ని భావించిన తాగుబోతులు ఎంచ‌క్కా మెట్రోలో ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన మెట్రో అదికారులు తాగుబోతుల‌కు మ‌త్తుదిగిపోయే ప్ర‌ణాళిక ర‌చించారు. తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోతే ఎంత జ‌రిమానా విధిస్తారో అంత‌కు రెట్టింపు జ‌రిమానాను వ‌సూలు చేసింది మెట్రో. దీంతో తాగుబోతుల‌కు దిమ్మ‌దిరిగి బొమ్మ క‌నిపించినంత ప‌నైంది. ఇదంతా ఎక్క‌డో కాదు దేశ రాజ‌ధాని ఢిల్లీలో.

   ఆదాయ వ‌న‌రులుగా మారుతున్న తాగుబోతులు..! రాష్ట్రాల‌కు అద‌న‌పు ఇన్క‌మ్..!!

  ఆదాయ వ‌న‌రులుగా మారుతున్న తాగుబోతులు..! రాష్ట్రాల‌కు అద‌న‌పు ఇన్క‌మ్..!!

  ఢిల్లీ మెట్రోకు జ‌రిమానాల ద్వారా వ‌స్తున్న ఆదాయం పై ఇత‌ర రాష్ట్రాల ద్రుష్టి ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రంలో ఇప్పుడిప్పుడే విస్త‌రించిన మెట్రో విజ‌య‌వంతాగా ర‌న్ అవుతోంది. అత్యంత సంప‌న్నులు ఉండే మార్గంలో మ‌రో 30రోజుల్లో మెట్రో ప‌రుగులు తీయ‌నుంది. దీంతో మాటి మాటికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికేక‌న్నా మెట్రోలో ప్ర‌యాణం సుఖమ‌ని భావించే తాగుబోతుల‌కు చెక్ పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే త‌ర‌హాలో చెన్నై మెట్రో కూడా స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  తాగుబోతుల‌నుండి 18ల‌క్ష‌లు వ‌సూలు చేసిన ఢిల్లీ మెట్రో..! అదే బాట‌లో ఇత‌ర రాష్ట్రాలు..!!

  తాగుబోతుల‌నుండి 18ల‌క్ష‌లు వ‌సూలు చేసిన ఢిల్లీ మెట్రో..! అదే బాట‌లో ఇత‌ర రాష్ట్రాలు..!!

  మద్యం సేవించి రైలులో ప్రయాణించిన వారి నుంచి జరిమానా రూపంలో దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) 18లక్షలు వసూలు చేసింది. 2014 నుంచి 2018 వరకు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆల్కహాల్ సేవించిన 3,601 మంది ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది. 2018లో 1,416 మంది నుంచి, 2017లో 476 మంది నుంచి జరిమానా వసూలు చేశామని డీఎంఆర్‌సీ అధికారులు వెల్లడించారు. 2016, 2015, 2014 సంవత్సరాల్లో వరుసగా 420, 531, 758 మంది జరిమానా చెల్లించారని తెలిపారు. ఆ జరిమానా 500 ఉంటుందన్నారు.

  మ‌ద్యం సేవించి మెట్రో ఎక్కొందంటున్నా లెక్క చేయ‌ని తాగుబోతులు..! జ‌రిమానాతో శిక్ష‌..!!

  మ‌ద్యం సేవించి మెట్రో ఎక్కొందంటున్నా లెక్క చేయ‌ని తాగుబోతులు..! జ‌రిమానాతో శిక్ష‌..!!

  మద్యం సేవించి ప్రయాణించవద్దని హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ, కొందరు వాటిని ఖాతరు చేయట్లేదని డీఎంఆర్‌సీ ప్రతినిధి ఒకరు తెలిపారు.ముఖ్యంగా కన్నాట్, హాజ్‌ ఖాస్‌, ఖాన్ మార్కెట్ ప్రాంతం నుంచే ఆల్కహాల్ సేవించిన వారు రైల్వే స్టేషన్లకు వస్తున్నారన్నారు. ఆ దగ్గర్లో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు ఉండటమే అందుకు కారణమని తెలిపారు. అతిగా సేవించిన వారిని కొన్ని సార్లు ఇంటి వద్ద దింపిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీఐఎస్ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.

   మెట్రో ఆదాయ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తున్న ఇత‌ర రాష్ట్రాలు..! అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం..!!

  మెట్రో ఆదాయ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తున్న ఇత‌ర రాష్ట్రాలు..! అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం..!!

  పక్కన స్నేహితులు, బంధువులు ఉంటేనే అలాంటి వారిని రైల్లోకి ఎక్కేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. లేకపోతే వారు ఇతర ప్రయాణికులతో ఘర్షణలకు దిగడం, పట్టాల మీదకు దూకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఐతే జ‌రిమానా ఆలోచ‌న విజ‌య‌వంతాగా ప‌నిచేస్తోంద‌ని, మెట్రో ట్రెయిన్ కు ఆదాయం కూడా పెరిగింద‌ని ఢిల్లీ మెట్రో అదికారుల తెలియ‌జేస్తున్నారు. ఇదే విధానాన్ని హైద‌రాబాద్, చెన్నై, ప‌శ్చిమ బెంగాల్ మ‌హారాష్ట్రాల్లో కూడా ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు మెట్రో అదికార‌లు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  English summary
  Delhi Metro Rail Corporation (DMRC) has collected 18 lakhs of fine passengers from alcohol passengers. The total amount of alcohol consumed from 3,601 passengers during the last five years from 2014 to 2018 was collected.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X