Jharkhand Assembly Election 2019 live: నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలింగ్

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌కు అంతా సిద్దమైంది. పలువురు కీలక నేతలు బరిలో ఉండటంతో 15 అసెంబ్లీ సీట్లకు జరిగే పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 47,85,009 ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతుండగా అందులో 25,40,794 ఓటర్లు పురుషులు, 22,44,134 ఓటర్లు మహిళలు ఉన్నారు. ఇందులో 95795 మంది తొలి సారి ఓట్లు హక్కను వినియోగించుకోవడం గమనార్హం. ఈ క్రమంలో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్..

Jharkhand Assembly Election 2019 live

Dec 16, 2019, 5:01 pm IST

నక్సలైట్లు పిలుపునిచ్చిన నియోజకవర్గాల్లో

నక్సలైట్లు పిలుపునిచ్చిన నియోజకవర్గాల్లో
ఎన్నికలు బహిష్కరించాలని నక్సలైట్లు పిలుపునిచ్చిన గిరిధి, ధన్‌బాద్, తుండి, సింధ్రి నియోజకవర్గాల్లో భారీగా తరలివచ్చిన ఓటర్లు.
Dec 16, 2019, 4:47 pm IST

ఎన్నికలు బహిష్కరించాలని నక్సలైట్లు

ఎన్నికలు బహిష్కరించాలని నక్సలైట్లు పిలుపునిచ్చిన గిరిధి, ధన్‌బాద్, తుండి, సింధ్రి నియోజకవర్గాల్లో భారీగా తరలివచ్చిన ఓటర్లు.
Dec 16, 2019, 4:45 pm IST

3 గంటలకు ముగిసిన పోలింగ్

జామ్వా, బగోదర్, గిరిధి, దుమ్రీ, తుండి నియోజకవర్గాల్లో 3 గంటలకు ముగిసిన పోలింగ్
Dec 16, 2019, 3:54 pm IST

4 నెలల్లోనే రామ మందిర నిర్మాణం.

అయోధ్యలో 4 నెలల్లోనే రామ మందిర నిర్మాణం.. హోంమంత్రి అమిత్ షా డెడ్‌లైన్
Dec 16, 2019, 3:24 pm IST

ధన్‌బాద్‌లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొన్న యువతి

ధన్‌బాద్‌లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొన్న యువతి
జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ధన్‌బాద్‌లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొన్న యువతి... ఆనందంతో చేతికి ఉన్న ఇంక్‌ను చూపిస్తున్న దృశ్యం
Dec 16, 2019, 2:31 pm IST

1 గంట వరకు 44.74 శాతం పోలింగ్

1 గంట వరకు 44.74 శాతం పోలింగ్
జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికల్లో 1 గంట వరకు 44.74 శాతం పోలింగ్ నమోదు.. ఈసీ అధికారులు
Dec 16, 2019, 2:30 pm IST

5 గంటల వరకు పోలింగ్

జామ్వా, బగోడదర్, గిరిధి, దుమ్రీ, తుండీ నియోజకవర్గాల్లో పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది అని ఈసీ వెల్లడించింది.
Dec 16, 2019, 12:38 pm IST

ఉదయం 11 గంటల సమయానికి 28.5శాతం పోలింగ్ నమోదు
Dec 16, 2019, 11:01 am IST

రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇండియా వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని కోరిన ఈసీ
Dec 16, 2019, 10:14 am IST

ఉదయం 9 గంటల సమయానికి 11.77శాతం పోలింగ్ నమోదు
Dec 16, 2019, 9:43 am IST

ధన్‌బాద్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మాజీ మంత్రి మనన్ మాలిక్
Dec 16, 2019, 9:13 am IST

మొత్తం 6,101 పోలింగ్ స్టేషన్లలో 587 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉండగా...405 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. నక్సల్ ప్రభావిత్ ప్రాంతాల్లోనే 546 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి
Dec 16, 2019, 8:55 am IST

60 మందికిపైగా కోటీశ్వరులే.

60 మందికిపైగా కోటీశ్వరులే.
జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికల్లో పోటీ చేసే 221 మందిలో 60 మందికిపైగా కోటీశ్వరులే. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.25 కోట్లు
Dec 16, 2019, 8:18 am IST

ప్రజాస్వామ్యానికి పండగలాంటి ఎన్నిక

జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పండగలాంటి ఎన్నికలో ఓటర్లు పాల్గొని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.. ప్రధాని నరేంద్రమోదీ
Dec 16, 2019, 8:14 am IST

75 అభ్యర్థులకు నేరచరిత

నాలుగో విడత పోలింగ్‌లో 75 అభ్యర్థులకు నేరచరిత, పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.
Dec 16, 2019, 7:41 am IST

ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్

జార్ఖండ్‌లో ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్
Dec 16, 2019, 6:59 am IST

ధన్‌బాద్‌లో పోలింగ్ ఏర్పాట్లు

ధన్‌బాద్‌లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల సిబ్బంది, అధికారులు
Dec 16, 2019, 6:57 am IST

మాక్ పోలింగ్

ధియోగఢ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది, అధికారులు
Dec 16, 2019, 6:55 am IST

డిసెంబర్ 23వ తేదీన ఫలితాలు

ఐదు విడుతలుగా సాగే జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 23వ తేదీన వెల్లడిస్తారు.
Dec 16, 2019, 6:47 am IST

కీలక స్థానాలు ఇవే

నాలుగో విడతలో బొకారో, చందన్ కియారీ, ఝరియా, బాగ్‌మారా, నిర్సా స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Dec 16, 2019, 6:34 am IST

బీజేపీకి ప్రతిష్టాత్మకంగా

నాలుగో విడత పోలింగ్ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
Dec 16, 2019, 6:33 am IST

ధియోగఢ్ జిల్లాలో

ధియోగఢ్ జిల్లాలో 674832 మంది ఓటర్లు, గిరిధి జిల్లాలో 1418753 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Dec 16, 2019, 6:32 am IST

221 మంది అభ్యర్థులు పోటీ

15 సీట్ల కోసం 221 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 23 మంది మహిళలు ఉన్నారు.
Dec 16, 2019, 6:30 am IST

నాలుగో విడత ఎన్నికల కోసం

నాలుగో విడత ఎన్నికల కోసం ఉదయం 7 గంటలకు ప్రోలింగ్ ప్రారంభమవుతుంది. 10 నియోజకవర్గాల్లో పోలింగ్ మూడు గంటల వరకు.. మిగితా స్థానాల్లో 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+