జార్ఖండ్ ఎన్నికల కసరత్తు.. హేమంత్ సోరెన్ తో హేమంత్ సోరెన్ భేటీపై ఆసక్తి!

ఈ సంవత్సరం జార్ఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. మహారాష్ట్ర తో కలిసి ఒకేసారి ఝార్ఖండ్ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం హర్యానా, జమ్మూకాశ్మీర్లో ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రస్థానం ముగిసిన తర్వాత జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

జార్ఖండ్ ఎన్నికలకు కసరత్తు
ఇక ఈ క్రమంలో అప్పుడే ఎన్నికల పైన జార్ఖండ్ రాష్ట్రంలో ముమ్మర కసరత్తు మొదలైంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రత్యర్థి పార్టీ అయిన బిజెపిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల వ్యూహాలతో జార్ఖండ్ రాష్ట్రంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Jharkhand election exercise Interest in meeting Hemant Soren with another Hemant Soren

హేమంత్ సోరెన్ ను కలిసిన హేమంత్ సోరెన్
ఇక ఇదే సమయంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హేమంత్ సోరెన్ తో హేమంత్ సోరెన్ భేటీ అయ్యాడు. అదేంటి హేమంత్ సోరెన్ తో హేమంత్ సోరెన్ ఏ విధంగా భేటీ అవుతాడు అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే అచ్చం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ లా ఉన్న మరో వ్యక్తి నేడు సీఎంను కలిశారు.

సీఎం ను కలిసిన అచ్చం హేమంత్ సోరెన్ లా ఉన్న మరో వ్యక్తి
రాంచికి చెందిన మున్నా లోహ్రా ఓ థియేటర్ ఆర్టిస్ట్. ఆయన తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆయన నివాసంలో తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి కలిశారు. కాసేపు సరదాగా హేమంత్ సోరెన్ తో మాట్లాడిన ఆయన థియేటర్ ఆర్టిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.

సీఎం ఆసక్తికర పోస్టు

ఆపై సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా థియేటర్ ఆర్టిస్టు లోహ్రాతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా హేమంత్ సోరెన్ ను కలిసిన కలిసిన మరో హేమంత్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక వీరిద్దరి ఫోటోలను చూసిన జార్ఖండ్ వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరు ట్విన్స్ లా భలే ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారానికి హేమంత్ ను పోలిన వ్యక్తి కూడా?
ఇందులో అసలు హేమంత్ సోరెన్ ఎవరు అంటూ పలువురు చమత్కరిస్తున్నారు. మొత్తంగా హేమంత్ సోరెన్ ను కలిసిన వ్యక్తి అచ్చుగుద్దినట్టు ఆయనలాగే ఉండడంతో ఎన్నికలవేళ హేమంత్ కోసం ఆయన కూడా రంగంలోకి దిగుతారా అన్నది ఆసక్తిగా మారింది. హేమంత్ సోరెన్ తన అభిమాని అయిన లోహ్రాను కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటారు అన్న చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+