సీఎం హేమంత్‌కు భారీ షాక్: బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్యేలు

రాంచీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు జార్ఖండ్‌లో జేఎంఎం అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చంపైతోపాటు పలువురు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

ప్రస్తుతం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న చంపై సోరెన్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచరం ప్రకారం.. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మాజీ ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్ కూడా సోరెన్‌తో పాటు బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి.

Jharkhand Ex-CM Champai Soren several other JMM MLAs likely to join BJP ahead of Assembly polls

హేమంత్ సోరెన్ స్థానంలో ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నియామకమై ఐదు నెలల తర్వాత ఆ పదవి నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయబడటానికి ముందు.. చంపై ముందున్న హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. దీంతో కొద్ది రోజుల తర్వాత.. ఫిబ్రవరి 2న చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఇటీవల హేమంత్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. జేఎంఎం పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్‌కు మార్గం సుగమం చేసేందుకు చంపై తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+