Jharkhand Polls: జార్ఖండ్ లో హోరాహోరీ-ఇండియా కూటమికి కొత్త అర్దం చెప్పిన నడ్డా..!

జార్ఖండ్ అసెంబ్లీకి జరుగుతున్న రెండో విడత పోలింగ్ ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 20న జరిగే రెండో దశ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు ఇండియా కూటమి, ఎన్డీయే సిద్ధమవుతున్నాయి. రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో పార్టీల మధ్య మాటల యుద్దం కూడా పెరుగుతోంది. ఇదే క్రమంలో జార్ఖండ్ లో ప్రచారం నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికార ఇండియా కూటమిపై మాటల తూటాలు పేల్చారు.

జార్ఖండ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇండియా కూటమి ఏర్పాటు వెనుక స్వార్ధపూరిత ఉద్దేశాలు ఉన్నాయని ధన్ బాద్ జిల్లాలోని సింద్రీలో జరిగిన ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వారసత్వ రాజకీయాలతో పాటు ఓటర్లను బుజ్జగించే రాజకీయాలే ఇందులో ఉన్నాయని నడ్డా ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అభివృద్ధి పథకాలను జార్ఖండ్ లో అమలు కాకుండా సీఎం హేమంత్ సోరెన్ అడ్డుపడుతున్నారని నడ్డా విమర్శించారు.

Jharkhand Polls jp nadda slams india bloc says formed with selfish motives

జార్ఖండ్ లో అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గిరిజన వ్యతిరేకం, రైతుల వ్యతిరేకం, దళితులు వ్యతిరేకమని జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఓటర్ల బుజ్జగింపు రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. గిరిజన భూముల్లో ఆక్రమణదారుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుని వారి భూముల్ని కబ్జా చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వీటికి అడ్డుకట్ట వేసేలా చట్టం చేస్తామని జేపీ నడ్డా ఓటర్లకు హామీ ఇచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+