Jharkhand Protest: జార్ఖండ్ లో ఢిల్లీ సీన్ రిపీట్ - విద్యార్ధుల రచ్చ రచ్చ-బ్యారికేడ్ల బద్దలు..!

జార్ఖండ్ లో పరీక్షల అక్రమాలపై కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు చేపడుతున్న విద్యార్ధులు ఇవాళ అసెంబ్లీ మార్చ్ (Jharkhand Protest )కు పిలుపునిచ్చారు. విద్యార్ధులకు మద్దతుగా నిరాహారదీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతోను కూడా తమతో పాటు తీసుకుని అసెంబ్లీకి విద్యార్ధులు బయలుదేరారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. విద్యార్ధుల అసెంబ్లీ మార్చ్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమై రాంచీలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినా ఆందోళనకారులు వాటిని బద్దలు కొట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!
Cockroach Janta Party: కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ ఉద్యమం ఇదే-అజెండా ప్రకటన..!

జార్ఖండ్‌లో జరిగిన వివిధ పోటీ పరీక్షలలో జరిగిన అక్రమాలకు నిరసనగా వేలాది మంది ఉద్యోగార్థులు ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీ వైపు మార్చ్ ప్రారంభించారు. నిరసనకారులలో ఎక్కుల మంది విధానసభ సమీపానికి చేరుకోగా, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో కూడా అంబులెన్స్‌లో ఈ పాదయాత్రలో చేరారు. ఇప్పటికే తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన.. 10.5 కిలోల బరువు తగ్గారు. అయినా ఆయన విద్యార్దులతో కలిసి మార్చ్ లో పాల్గొంటున్నారు.

Jharkhand Protest Escalates as Thousands Breach Barricades Near Assembly Water Cannons Deployed
డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!
డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!

14వ జేపీఎస్సీ సంయుక్త సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షతో సహా మూడు పరీక్షలను రద్దు చేసేందుకు జార్ఖండ్ ప్రభుత్వం నిన్న అంగీకరించింది. అయినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నిన్న జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)కి చెందిన ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా విద్యార్ధులు చేసిన పలు ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది. అయినా ఇంకా తమ డిమాండ్లు నేరవేరలేదని ఆరోపిస్తూ విద్యార్ధులు ఇవాళ అసెంబ్లీ మార్చ్ చేపట్టారు. దీంతో రాంచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. మరోవైపు జార్ఖండ్ లో విద్యార్ధుల ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఎక్స్ లో సీజేపీ నాయకులు జార్ఖండ్ విద్యార్ధులకు మద్దతుగా పలు ట్వీట్లు చేస్తున్నారు. అలాగే విపక్ష బీజేపీ కూడా మద్దతుగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+