Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియో బంపర్ ఆఫర్: రూ.399 రీఛార్జీతో వంద శాతం క్యాష్‌బ్యాక్

రిలయన్స్ జియో తన కష్టమర్లకు బంపర్‌ను ప్రకటించింది. రూ.399 రీ ఛార్జీ చేసుకొంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను జియో ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 12 నుండి 18 మధ్య రూ.399 రీఛార్జీ చేసుకొన్న వారి

Recommended Video

    Jio Dhan Dhana Dhan New Offer : 100% Cashback on 399 Plan | Oneindia Telugu

    న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన కష్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.రూ.399 రీఛార్జీ చేసుకొంటే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

    ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌తో తక్కువ ధరకే డేటాను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది జియో. తాజాగా దీపావళి పండగను పురస్కరించుకుని మరో బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. దీపావళీ ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.

    Jio Diwali Offer: 100 Percent Cashback on Rs. 399 Recharge

    అక్టోబర్ 12వ,తేదిన ఆఫర్‌ ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ వోచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

    రూ.399 ఆఫర్‌తో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు 84జీబీ డేటా(రోజుకు 1జీబీ) ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌, ఉచిత కాలింగ్స్‌ అందిస్తుంది. ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ 84రోజులు. అయితే తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌లో కస్టమర్లు అక్టోబర్‌ 12 నుంచి 18 మధ్య రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 వోచర్లు వస్తాయి.

    అంటే మొత్తం రూ.400 వస్తుంది. ఈ వోచర్లను మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. నవంబర్‌ 15 తర్వాత మాత్రమే ఈ వోచర్లను వినియోగించుకోవచ్చు.

    అయితే రూ.309 అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు మాత్రమే ఈ వోచర్లు వర్తిస్తాయి. ఇప్పటికే ఏదైనా జియో ప్లాన్‌ వినియోగించుకుంటున్నవారు ఈ ఆఫర్‌ తీసుకుంటే ప్రస్తుత ప్లాన్‌ ముగిసిన తర్వాతే ఈ కొత్త ఆఫర్‌ ప్రారంభమవుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+