జాతీయగీతం పాడారని దాడి: విద్యార్థుల పోరు(వీడియో)
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదుల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. కొందరు వేర్పాటువాద సానుభూతిపరుల వల్ల ఓ పాఠశాలలో జాతీయగీతం పాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు, యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనకు దిగారు. జాతీయగీతం పాడేందు కోసం వారు పోరాటమే చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. దోడా జిల్లాలోని ఓ పాఠశాలలో జాతీయ గీతం పాడినందుకు విద్యార్థులపై ఉపాధ్యాయులు దాడి చేశారు. అంతేగాక, ఇకపై వందేమాతరం, జనగణమణ పాడితే బడి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
హాద్వా ప్రాంతంలోని హైయర్ సెకండరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. గత రెండేళ్లుగా పాఠశాలలో జాతీయ గీతం పాడే అవకాశం ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు.
ఈసారి ధైర్యం కూడగట్టుకున్న విద్యార్థులు ఆగస్టు 15న విద్యార్థులంతా జాతీయగీతం ఆలపించారు. వారిని మధ్యలోనే అడ్డుకున్న కొందరు ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులపై దాడి చేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోడాకు కాలినడకన వెళ్లారు. అక్కడ విద్యాశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
కాగా, ఘటనపై స్పందించిన కమిషనర్ సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతించిన విద్యార్థులు అక్కడి నుంచి వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications