వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో జీతా! వహీ సికిందర్: స్మృతి, ‘పుట్టగొడుగుల కేక్ స్పెషల్’ సెటైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించారు. సోమవారం ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తమకు చాలా సంతోషం కలిగించే విషయమని అన్నారు.

6వసారి: మోడీ విక్టరీ సింబల్, బీజేపీ సంబరాలు: సోనియాతో రాహుల్ భేటీ6వసారి: మోడీ విక్టరీ సింబల్, బీజేపీ సంబరాలు: సోనియాతో రాహుల్ భేటీ

అంతేగాక, ఇది అభివృద్ధి గెలుచుకున్న విజయమని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చిందన్న ప్రశ్నపైనా ఆమె స్పందించారు. 'జో జీతా వహీ సికందర్(గెలిచిన వాడే రాజు). బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త పడిన కష్టానికి ప్రతిఫలమే బీజేపీ విజయం' అని స్మృతీ ఇరానీ చెప్పారు. అభివృద్ధిపై నమ్మకముంచి ప్రజలే మాకు పట్టంగట్టారని తెలిపారు.

రాహుల్ చేయని ప్రయత్నం లేదు.. ఐనా

రాహుల్ చేయని ప్రయత్నం లేదు.. ఐనా

గుజరాత్ ప్రజలు అభివృద్ధికే పట్టంగట్టారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారు. ఇప్పటికే మా విజయం ఖరారైనప్పటికీ... తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రజాభిమానం మెండుగా ఉండబట్టే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తున్నారు' అని స్పష్టం చేశారు. గుజరాత్‌లో విజయం కోసం రాహుల్ గాంధీ చేయని ప్రయత్నం లేదనీ... అయినప్పటికీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధికే ఓటేశారన్నారు.

అల్పేష్ ఠాకూర్ వ్యాఖ్యలు ఇప్పుడు కేక్‌లా

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ నాయ‌కుడు అల్పేశ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను, ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత బీజేపీ కార్య‌క‌ర్త‌లు తిప్పికొట్టారు. ప్ర‌ధాని మోడీ తెల్ల‌గా క‌నిపించ‌డానికి, ఆయ‌న తైవాన్ నుంచి దిగుమ‌తి చేసుకున్న పుట్ట‌గొడుగులు తిన‌డ‌మే కార‌ణ‌మ‌ని అల్పేశ్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.
ఈ మాట‌ల‌ను గుర్తుపెట్టుకున్న బీజేపీ నేత‌లు కేకు మీద పుట్ట‌గొడుగు బొమ్మ‌లు వేయించి త‌మ విజ‌యానికి గుర్తుగా కట్ చేశారు. ఈ కేక్ క‌ట్టింగ్ ఫొటోల‌ను బీజేపీ ప్ర‌తినిధి తాజింద‌ర్ బ‌గ్గా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `ఇది తైవాన్ నుంచి తెప్పించిన పుట్ట‌గొడుగుల కేక్‌` అంటూ కేక్‌పై రాశారు.

ఓడిపోతే ఈవీఎంలు సరిలేవంటారా?

ఓడిపోతే ఈవీఎంలు సరిలేవంటారా?

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయంపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ... ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఈవీఎంలు స‌రిగా లేవ‌న‌డం స‌రికాద‌ని అన్నారు. అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌శ్నించారు. గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికార‌ని చెప్పారు. అభివృద్ధికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో గెలుపు, ఓట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించాల‌ని హిత‌వు ప‌లికారు.

రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసం

రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసం

కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దాదాపు ఖరారైపోయింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఏకపక్షం కాగా, గుజరాత్ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాగా, గుజరాత్ లో బీజేపీ ఆరోసారి అధికారం చేపట్టడం గమనార్హం.

English summary
The winner is king, Information and Broadcasting Minister Smriti Irani said on Monday as the BJP was set for victory in Gujarat and Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X