సాఫ్ట్‌వేర్ సంక్షోభం: జ్యోతిష్యుల వైపు టెక్కీల పరుగులు
సాఫ్ట్‌వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగభద్రత కోసం టెక్కీలు జ్యోతిష్యులు, న్యూమారాలజిస్టులను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు వారు తమ ఉద్యోగాల్లో భద్రత విషయమై ఆరాతీస్తున్నారు. ఉద్యోగం
బెంగుళూరు:సాఫ్ట్‌వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగభద్రత కోసం టెక్కీలు జ్యోతిష్యులు, న్యూమారాలజిస్టులను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు వారు తమ ఉద్యోగాల్లో భద్రత విషయమై ఆరాతీస్తున్నారు. ఉద్యోగం కోల్పోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిష్కారమార్గాలను తెలుసుకొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో ఉంది. అయితే ఈ కారణాల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉద్యోగ భద్రత కరువైంది.
ఇండియాలోని చాలా కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే టెక్కీలకు పింక్ స్లిప్పులను అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి.అయితే ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు ప్రధానంగా ఇండియా ఐటీ పరిశ్రమలపై తీవ్రంగా కన్పిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తోందోననే భయంతో టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. దరిమిలా తమ ఉద్యోగ భద్రత విషయమై జ్యోతిష్యులను, సంఖ్యశాస్త్ర నిపుణులను ఆశ్రయిస్తున్నారు.

జ్యోతిష్యుల ఇంటికి బారులు తీరుతున్న టెక్కీలు
సంక్షోభంలో ఉన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమతో టెక్కీలు భయాందోళనల్లో ఉన్నారు. ఉద్యోగభద్రత లేదనే ఆందోళన వారిలో వ్యక్తమౌతోంది. దీంతో వారంతా జ్యోతిష్యులు,న్యూమారాలజిస్టుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎప్పుడు పింక్ స్లిప్పులు వస్తాయోననే భయం నెలకొన్న నేపథ్యంలో పరిహరాలు, ప్రత్యామ్నాయమార్గాల కోసం టెక్కీలు తాపత్రయపడుతున్నారు. దరిమలా జ్యోతిష్యులు, సంఖ్యశాస్త్ర నిపుణుల వద్దకు వెళ్తున్నారు.
Recommended Video


95 శాతం జ్యోతిష్యుల వద్దకు టెక్కీలే
తమ భవిష్యత్‌ను తెలుసుకొనేందుకు టెక్కీలు జ్యోతిష్యుల వద్దకు వెళ్థున్నారు. బెంగుళూరులోని షీలా బజాజ్ డైరీ ప్రముఖ న్యూమరాలజిస్ట్. ఆమె వద్దకు వచ్చేవారిలో 95 శాతం టెక్కీలే ఉన్నారు. పరిహరం కోసమో, పేరు మార్పు కోసమో, ఇంకా ఇతరత్రా సూచనలు, సలహల కోసం షీలా బజాజ్ వద్దకు టెక్కీలు వెళ్తున్నారు.

టెక్కీలు అడిగే ప్రశ్నలివే
లే ఆఫ్ ప్రమాదం ఉందా... లే ఆఫ్ ప్రమాదం పొంచి ఉంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి...పరిహరాలున్నాయా, ప్రత్యామ్నాయాలున్నాయా అనే అంశాలపై టెక్కీలు న్యూమరాలజిస్టును ప్రశ్నిస్తున్నారని సమాచారం. దీని నుండి బయటపడేందుకు తక్షణమే ఉన్న అధ్యాత్మిక మార్గాలు ఏమిటనే విషయాలపై కూడ వారు ఆరాతీస్తున్నారు.

35-45 ఏళ్ళ వయస్సు వారే ఎక్కువ
జ్యోతిష్యులను, సంఖ్యశాస్త్ర నిపుణుల సంప్రదించే వారిలో ఎక్కువ మంది 35-45 ఏళ్ళ వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని తేలింది. వీరంతా కూడ తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనతో ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ ఫీజును చెల్లించేందుకు కూడ టెక్కీలు వెనుకడుగు వేయడం లేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications