రూ.11వేల కోట్ల మోసానికి రూ.2కోట్ల బీమానా!: పీఎన్బీకి తప్పని భారీ మూల్యం?
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో జరిగిన భారీ కుంభకోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బ్యాంకుల్లో ఉద్యోగుల ద్వారా ఏదైనా మోసం జరిగితే బీమా వచ్చేలా చర్యలు తీసుకుంటాయి. పీఎన్బీ కూడా అదే చేసింది కానీ, అది భారీ మూల్యానికి కావడం గమనార్హం.
Recommended Video

పీఎన్బీ చేసిన బీమా రూ.2కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు రూ.11వేల కోట్ల మోసానికి కూడా బీమా కింద బ్యాంకుకు వచ్చేది రూ.2కోట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

పీఎన్బీ చేసిన తప్పిదం
కాగా, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపరిహార బీమా పాలసీ కింద వాణిజ్య, బిల్ డిస్కౌంటింగ్, సైబర్ బీమా కింద కింద ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని తీసుకున్నాయి. కానీ, పీఎన్బీ మాత్రం అలా చేయలేదు. ఈ బీమాను యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ 40శాతం వరకు ఇస్తోంది. ఇక మిగితా 60శాతం బీమాను మూడు ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాయి.

11వేల కోట్లకు రూ.2కోట్లు మాత్రమే
ఈ వ్యవహారంలో యూనైటెడ్ ఇండియాకు చెందిన ఓ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. పీఎన్బీ బ్యాంకర్ నష్ట పరిహార పాలసీ కింద రూ.5కోట్ల ప్రీమియంను చెల్లిస్తోంది. ఈ పాలసీ మొత్తం బీమాను కల్పించదు. ఆస్తి నష్టం, అగ్ని ప్రమాదం, దోపిడీ, మోసాల కింద ఈ బీమా నిర్దిష్ట పరిమితులను మాత్రమే కవర్ చేస్తోంది. అలా పీఎన్బీ ఉద్యోగులు ఏదైనా మోసానికి పాల్పడితే ఆ బ్యాంకుకు వచ్చే బీమా రూ.2కోట్లు మాత్రమేనట.

ఉద్యోగులు మోసపూరితంగా..
పీఎన్బీలో మోసం 2011 నుంచి జరుగుతోందని వాళ్లే చెబుతున్నారు.. కానీ, పీఎన్బీకి తాము బీమాను రెండేళ్ల నుంచి మాత్రమే అందిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. ముంబైలోని ఓ పీఎన్బీ బ్రాంచిలో రూ.11,400కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగిన విషయం తెలిసిందే. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి చేకూర్చేందుకు తమ సిబ్బంది తప్పుడు ‘లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్ఓయూ)'ల ద్వారా కుట్ర పన్నినట్లు పీఎన్బీ వెల్లడించింది.

షాకిచ్చిన ఆర్బీఐ..?
కాగా, ఎల్ఓయూని చూపించి విదేశాల్లో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఆ విధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ తదితర 30బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. పీఎన్బీ.. మధ్యవర్తిగా ఉండి రుణాలు ఇప్పించిన బ్యాంకులన్నింటికీ రూ.11వేల కోట్ల మొత్తాన్ని పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ కూడా ఆదేశించినట్లు సమాచారం. దీంతో పీఎన్బీకి గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications