జస్టిస్ ఎన్వీ రమణ రొమాంటిక్ నవల రాయబోతున్నారా - బయట పెట్టిన న్యాయాధికారి..!!

సీజేఐ ఎన్వీ రమణ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజుతో పదవీ కాలం ముగిసింది. రేపు ( శనివారం) నూతన సీజేఐగా యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో..సీజేఐగా ఎన్వీ రమణకు సుప్రీం కోర్టులో వీడ్కోలు సభ జరిగింది. ఆ సమయంలో పలువురు న్యాయాధికారులు..ప్రముఖులు సీజేఐగా రమణ చేసిన సేవలను కొనియాడారు. అందులో భాగంగా సొలిసటర్ జనరల్ తుషార్ మెహతా తన ప్రసంగంలో ఛలోక్తులతో నవ్వులు పూయించారు.

సీజేఐగా రమణ సేవలను ప్రశంసిస్తూ

సీజేఐగా రమణ సేవలను ప్రశంసిస్తూ

సీజేఐగా ఎన్వీ రమణ గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో..మౌళిక వసతుల కల్పినలో కీలకంగా వ్యవహిరించారని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా వెలువరించిన తీర్పుల్లో రమణ తనదైన ముద్ర వేసారని అభివర్ణించారు. సామాన్యుడు అర్దం చేసుకొనే విధంగా తీర్పులు ఉండేవన్నారు. ఈ రోజున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సీజేఐ పదవీ విరమణ గురించి ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతం అవటం గురించి ప్రస్తావించారు. దవే ఆలస్యంగా ఎన్వీ రమణ అంటే ఏంటో అర్దం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

రొమాంటిక్ నవల రాయబోతున్నారంటూ

రొమాంటిక్ నవల రాయబోతున్నారంటూ


సీజేఐ ఏనాడు దురుసుగా.. గట్టిగా వ్యవహరించిన సందర్భాలు లేవన్నారు. ప్రతీ ఒక్కరితో ప్రేమ..అప్యాయతతో వ్యవహరించటం చూసానన్నారు. తనకు తెలిసిన సమాచారం మేరకు..జస్టిస్ రమణ న్యాయమూర్తిగానే కాకుండా.. ఆయనకు తెలుగు లిటిరేచర్ పైన మంచి అభిమానం ఉందన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ రిటైరైన తరువా ఒక రొమాంటిక్ నవల రాయబోతున్నట్లుగా తనకు తెలిసందన్నారు. ఆయన ఆ నవల రాయటంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటారంటూ నవ్వులు పూయించారు.

వీడ్కోలు సభలో సరదా సన్నివేశం

వీడ్కోలు సభలో సరదా సన్నివేశం


ఆ సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ నవ్వుతా కనిపించారు. సహచర న్యాయమూర్తులు..న్యాయవాదులు నవ్వుతూ..క్లాప్స్ కొడుతూ మద్దతు ప్రకటించారు. కొద్ది కాలం తరువాత ప్రస్తుత న్యాయ మూర్తులంతా తాము ఒక తెలుగు కవితో కలిసి పని చేసామని చెప్పుకోవాల్సి వస్తుందంటూ తుషార్ మోహతా చెప్పుకొచ్చారు. ఆయన రిటైరైన తరువాత ఆరోగ్యంతో...ఆనందంగా జీవితం కొనసాగించాలని తుషార్ మెహతా ఆకాంక్షించారు. ఆ తరువాత జస్టిస్ ఎన్వీ రమణ తాను ఈ స్థానంకు ఎదగటానికి వెనుక ఉన్న కష్టాలను ప్రస్తావించారు. ఎమోషనల్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+