ఒకే టూర్ లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. బడ్జెట్ ధరలోనే.. హైదరాబాద్ నుంచే ప్రయాణం..
పరమశివుడు స్వయంభువుగా వెలసిన అత్యంత పవిత్రమైన క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అంటారు. మొత్తం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని దర్శించాలని చాలామందికి ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల వాటిని దర్శించడం వీలు పడదు. 12 జ్యోతిర్లింగాల వివరాలు చూస్తే గుజరాత్ లో సోమనాథ్, నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ లో మల్లికార్జున, మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర, ఉత్తరాఖండ్ లోని కేథార్ నాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, తమిళనాడులో రామేశ్వరం, జార్ఖండ్ లో వైద్యనాథ్, ఉత్తర్ ప్రదేశ్ కాశీ విశ్వనాథ్ ఆలయాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయాల్లో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే విధంగా IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పేరుతో Jyotirlinga Darshan Yatra అనే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఒకే యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.
ఈ టూర్ విశేషాలు చూస్తే.. ఈ యాత్ర ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, నాందేడ్, పూర్ణ జంక్షన్ మీదుగా ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ అయి ఫ్రెస్ అయిన తర్వాత మహాకాళేశ్వర్ ఆలయం, కారిడాన్ ను సందర్శిస్తారు. రాత్రికి ఉజ్జయినిలోనే బస చేస్తారు. ఇక 25 వ తేదీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం సందర్శన ఉంటుంది. రోడ్డు మార్గంలో ఇక్కడకు వెళ్తారు. ద్వారకకు చేరుకుంటారు. ఇక 27 వ తేదీ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం సందర్శన ఉంటుంది. ఇక 28 వ తేదీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక 30 వ తేదీ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్తారు. ఇక అక్టోబర్ 1 వ తేదీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది.

అలాగే అక్టోబర్ 2 వ తేదీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఈ ఆలయంతో సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర ముగుస్తుంది. దాంతో అదే రోజు రాత్రి 11 గంటలకు తిరుగుపయనమవుతారు. అక్టోబర్ 3 వ తేదీ మధ్యాహ్నానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగుతుంది. టికెట్ ధరల విషయానికి వస్తే ఎకానమీ టికెట్ ధర రూ.18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ టూర్ పై ఆసక్తి ఉన్న ప్రయాణికులు IRCTC టూరిజం పోర్టల్ ను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications