బాల్కనీ ప్రభుత్వాలు కింద ఏం జరుగుతుందో చూడాలి ..వలస కార్మికుల సంక్షోభంపై కమల్ హాసన్
కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తుంది . ఈ పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ఇక కరోనా ప్రభావంతో ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభానికి కరోనా కారణం అయ్యింది .ఇక చాలా దేశాలలో రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు పేద , గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు భయాందోళనకు గురవుతున్నారు.

దారుణంగా మారిన వలస కార్మికుల జీవనం
కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. వర్తక వాణిజ్యాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. అన్నిటికంటే కరోనా ప్రభావం సామాన్య, దినసరి కూలీల మీద, వలస జీఉల మీద పడింది. పట్టెడు అన్నం కూడా దొరకటం వారికి కష్టంగా మారింది. కాయకష్టం చేసుకుందామన్నా పని దొరకని పరిస్థితి ఉంది . ఇక కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ముందు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.ఇక నిన్నటితో అది ముగియటంతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ముంబై లోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్దకు వలస కార్మికులు వెళ్ళటం వారి తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.

వలక కార్మికుల సంక్షోభమే కరోనా కన్నా పెద్ద సంక్షోభం అన్న కమల్
ఇక తాజాగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్ నియంత్రించేందకు దేశాన్ని మే 3 వారికి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వలస కార్మికుల దుస్థితిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఇది అన్నిటికంటే పెద్ద సంక్షోభం అన్నారు కమల్ హాసన్ . మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే పెద్ద ఎత్తున వలసకార్మికులు ముంబయిలోని బాంద్రా స్టేషన్ వద్ద గుమిగూడారు. వారిని అక్కడినుంచి పంపించి వేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

బాల్కనీ ప్రభుత్వాలు కిందికి చూడాలని కోరిన కమల్ హాసన్
ఈ ఘటన పై ట్విట్టర్ వేదికగా స్పందించారు కమల్ హాసన్ .''బాల్కనీలో ఉండేవారికి కిందికి చూడటం కష్టమవుతుంది. మొదట ఢిల్లీలో ఈ పరిస్థితి. ఇప్పుడు ముంబయి. వలసకార్మికుల సంక్షోభం అనేది ఒక టైమ్ బాంబ్ లాంటిది. అది కరోనా కంటే పెద్ద సంక్షోభం కాకముందే తగ్గించాలి. బాల్కనీ ప్రభుత్వాలు కింద కూడా ఏం జరుగుతుందో చూడాలి'' అని కమల్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది . ఇప్పటికే వలస కార్మికులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ ఉదయం ఆరు గంటల నుండే భోజనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు . వారి జీవనం దుర్భరంగా మారింది . ఇక వీరి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోకుంటే కరోనా కంటే పెద్ద సంక్షోభం రావటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది .
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications