వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kamal Haasan : చోళుల కాలంలో హిందూమతమే లేదు- కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

మణిరత్నం తాజాగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 తమిళనాట సంచలనాలు రేపుతోంది. ఇప్పటికే భారీ కలెక్షన్లతో కోలీవుడ్ లో దుమ్మురేపుతున్న ఈ చిత్రం అంతే స్ధాయిలో వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో చోళుల గొప్పతనాన్ని చాటుతూ మణిరత్నం వారిని ఆకాశానికెత్తేశారు. దీంతో ఇప్పుడు చోళుల గురించిన చర్చ పెరుగుతోంది. ఇందులో భాగంగానే చోళుల కాలంలో హిందూమతమే లేదన్న చర్చ కూడా జరుగుతోంది.

రాజరాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడైన వెట్రిమారన్ ఓ వివాదానికి తెరదీశారు. దీనికి కొనసాగింపుగా చోళుల కాలంలో అసలు హిందూమతమే లేదంటూ దిగ్గజ నటుడు కమల్ హాసన్ తాజాగా వ్యాఖ్యానించి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. వెట్రిమారన్ వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న తరుణంలోననే ఆయన్ను సమర్ధించేలా కమల్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి.

Kamal Haasans comments on Hindu Religion During Chola Period erupts controversy

వెట్రిమారన్‌ తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా...రాజ రాజ చోళుడు హిందువు కాదు, కానీ వారు (బిజెపి) మా గుర్తింపును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఇప్పటికే తిరువల్లువర్‌ను కాషాయం చేసేందుకు ప్రయత్నించారని, తాము దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదన్నారు. దీంతో అక్కడే ఉన్న కమల్ హాసన్..ఇదే అర్ధం వచ్చేలా రాజ రాజ చోళుని కాలంలో 'హిందూ మతం' అనే పేరు లేదని, వైనవం, శైవం, సమానం మాత్రమే ఉన్నాయన్నారు. అలాగే హిందూ అనే పదాన్ని కూడా ఉపయోగించలేదన్నారు. కాబట్టి బ్రిటిష్ వారు హిందూ అనే పదాన్ని ఉపయోగించారన్నారు. అలాగే బ్రిటిష్ వారు తుత్తుకుడిని టుటికోరిన్‌గా ఎలా మార్చారో ఇది కూడా అలాంటిదేనన్నారు.

వెట్రిమారన్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ రాజ చోళుడు నిజమైన హిందూరాజు అని బీజేపీ నేత హెచ్ రాజా తెలిపారు. తనకు వెట్రిమారన్‌లాగా చరిత్ర గురించి పెద్దగా అవగాహన లేదని, కానీ రాజ రాజ చోళుడు నిర్మించిన రెండు చర్చిలు, మసీదుల గురించి మాత్రం తెలుసన్నారు. రాజరాజచోళుడు తనను తాను శివపాద శేఖరన్ అని పిలిపించుకునే వాడని, అప్పుడు ఆయన హిందువు కాదా అని ప్రశ్నించారు. గతంలో 2019లో సైతం సినీ దర్శకుడు పీఏ రంజిత్ నాటి రాజుల పాలన దళితులకు అంధకార యుగమని అప్పట్లో వ్యాఖ్యానించారు. దీనిపైనా వివాదం రేగింది. ఆ తర్వాత సద్దుమణిగింది.

English summary
tamil legendary actor kamal haasan on today made controversial comments on hindu religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X