వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలన్లు చావు: సినిమా యూనిట్ కు 20 ప్రశ్నలు ఇవే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాస్తిగుడి సినిమా ప్రతినాయకులు అనీల్, ఉదయ్ జలసమాధి కావడానికి ఆ సినిమా యూనిట్ సభ్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, నిర్లక్షాలే కారణం అని వెలుగు చూసింది. ఇప్పటికే ఈ ఘటనపై జలమండలి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనీల్, ఉదయ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు సైతం కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యులు 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

ఆ విలన్లను ఇలా చంపేశారు: అధికారులు

1. తిప్పగుండనహళ్ళి జలాశయంలోని నిషేధిత ప్రాంతంలో షూటింగ్ చెయ్యరాదని జలమండి చెప్పింది. అయితే ఎందుకు పాటించలేదు ?
2. జలాశయంలోని నీటిలో సినిమా షూటింగ్ చెయ్యరాదని ముందే చెప్పారు. ఎందుకు వెళ్లారు ?
3. భారత చలన చిత్రరంగంలో కన్నడ ఫైట్ మాస్టర్ రవివర్మకు ఓ గుర్తింపు ఉంది. అయితే సాహస దృశ్యాలు చిత్రీకరించే సమయంలో ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు ?
4. ఈత రాని ఇద్దరు నటులను 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి ఎందుకు దూకించారు ?
5. మొదట 30 నుంచి 40 అడుగులు ఎత్తు అని చెప్పారు. స్పాట్ లోకి వెళ్లిన తరువాత 100 అడుగు ఎత్తు అని ఎందుకు అనీల్, ఉదయ్ కు షాక్ ఇచ్చారు ?
6. అనీల్,ఉదయ్ లకు ఎందుకు డూప్ పెట్టలేదు ? ఎవరు వద్దని చెప్పారు ?

Kannada Film Industry: Death of 2 actors on the sets of 'Masti Gudi'

'విలన్'ఉదయ్ మృ తి: నిర్మాత సుందర్ అరెస్టు

7. జ్వరం వస్తుందని ఉదయ్ చెప్పినా అతనిని ఎందుకు నేరుగా స్పాట్ కు తీసుకు వెళ్లారు ?
8. మొదట డూప్ లు నీళ్లలో దూకుతారని చెప్పారు, తరువాత అనీల్, ఉదయ్ ని ఎందుకు బలవంతంగా రియల్ స్టంట్ చెయ్యాలని ఒత్తిడి చేశారు ?
9. హెలికాప్టర్ నుంచి కిందకు రియల్ గా దూకాలి అని అనీల్, ఉదయ్ మీద పదేపదే ఎందుకు ఒత్తిడి తీసుకు వచ్చారు? ఎవరు చెప్పారు ?
10. హెలికాప్టర్ నుంచి ప్రతినాయకులు కిందకు దూకుతుంటే ఇద్దరు నటులకు ఎందుకు ఐరన్ రోప్ ఉపయోగించలేదు ?

విలన్లకు 'చావు'ముందే తెలుసు: చివరి మాటలు ఇవే

11. నీరు ఎక్కువగా ఉన్న చెరువులో 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతుంటే ఎందుకు లైఫ్ జాకెట్ వెయ్యలేదు ? అసలు వారి ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా ?
12. విలన్లు అనీల్, ఉదయ్ కు మీరు 100 అడుగుల ఎత్తు నుంచి దూకడానికి ఎన్ని సార్లు శిక్షణ ఇచ్చారు ?
13. హెలికాప్టర్ నుంచి కిందకు దూకే ప్రాంతంలో మీరు ముందుగా ఎందుకు మోటార్ బోట్ సిద్దంగా పెట్టలేదు ? ఆ ప్లాన్ ముందుగా ఎందుకు వేసుకోలేదు ?
14.షూటింగ్ ప్రాంతంలో స్పీడ్ బోట్ అవసరం ఉన్నా దానిని ఎందుకు తెప్పించలేదు ?
15. ఇలాంటి దుస్సాహసం చెయ్యడం కంటే గ్రాఫిక్ వర్క్ చెయ్యడానికి ఎందుకు ప్రయత్నించలేదు?

విలన్ కు ముందు బీడాలు వేస్తూ సిక్స్ ప్యాక్ చేసి. నిర్మాతగా

16. సినిమా షూటింగ్ ప్రాంతంలో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడానికి మీ మూర్ఖత్వం కారణమా ?
17. హీరో దునియా విజయ్ ని మాత్రం రక్షించారు, అయితే విలన్లు, వారి ప్రాణాలు అంటే లెక్కలేదా ? వారిద్దరిని ఎందుకు గాలికి వదిలేశారు ?
18. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న నటులు అంటే మీకు చీపురు పుల్లతో సమానమా ?
19. తిప్పగుండనహళ్ళి చెరువు గురించి మీరు ఏమి తెలుసుకున్నారు ? ఆ చెరువు ఎలాంటిది అని ఆలోచించారా ?
20. అనీల్, ఉదయ్ చావుకు మీలో ఎవరు భాద్యత వహిస్తారు ? వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి ?

English summary
Death of 2 actors on the sets of 'Masti Gudi' came as a shocker to Kannada Film Industry. Questions related to this incident are 20. But Problems are plenty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X