బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్: కొండచరియలు విరిగి..బోగీలను ఢీకొని: 2,348 మంది ప్రయాణికులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తాయి ఈ రెండు స్టేషన్లు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు ప్రకటించారు.

కన్నూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్..

కేరళలోని కన్నూర్, బెంగళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఇది. నంబర్ 16518 ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం 6 గంటలకు కన్నూర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆ సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. థలస్సేరి, వడక్కార, కోజికోడ్, షోరనూర్ జంక్షన్, పాలక్కాడ్, కోయంబత్తూర్ జంక్షన్, తిరుప్పూర్, ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, ధర్మపురి, హోసూర్, బానస్‌వాడి మీదుగా ఉదయం 7:40 నిమిషాలకు బెంగళూరుకు చేరాల్సి ఉంది.

తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య..

తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య..


మార్గమధ్యలో తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్ స్టేషన్ దాటిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. తొప్పూర్ నుంచి శివడి స్టేషన్‌‌కు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 3:30 నిమిషాలకు ధర్మపురి స్టేషన్‌ నుంచి బయలుదేరింది. ఆ తరువాత వచ్చిన తొప్పూర్ స్టేషన్‌ దాటిన కొద్దిసేపటికే అంటే 3:50 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. రైలు వెళ్తోన్న సమయంలో హఠాత్తుగా కొండ చరియలు విరిగి పడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రైలును ఢీ కొన్నాయి.

బోగీలను ఢీకొట్టిన బండరాళ్లు

బోగీలను ఢీకొట్టిన బండరాళ్లు

బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి రైలు బోగీలను ఢీ కొట్టాయి. వాటి చక్రాల మధ్య ఇరుక్కుపోయాయి. దీనితో ఈ అయిదు బోగీలు పట్టాలు తప్పాయి. పెద్ద శబ్దం చేస్తూ రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. చీకటి కావడం ఏ జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో అయిదు బోగీలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు గానీ, ప్రాణాపాయం గానీ సంభవించలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..

సమాచారం అందిన వెంటనే నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. పట్టాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పట్టాల మరమ్మతును చేపట్టారు. ఈ మధ్యాహ్నానికి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 తమిళనాడు అల్లకల్లోలం..

తమిళనాడు అల్లకల్లోలం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి, వాయుగుండం ప్రభావంతో కొద్దిరోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల వల్లే కొండచరియలు విరిగిపడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. రాజధాని చెన్నై సహా తీర ప్రాంత జిల్లాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇదే పరిస్థితి మిగిలిన జిల్లాల్లోనూ నెలకొంది. ధర్మపురి, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం నెలకొని ఉంది. నాలుగైదు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
వరద నీటిలోనే చెన్నై..

వరద నీటిలోనే చెన్నై..

చెన్నై ఇంకా వర్షపు నీటితోనే నానుతోంది. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించిన నేపథ్యంతో అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. నిరాశ్రయులైన వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. నాగపట్టణం, రామనాథపురం, కరైకల్, శివగంగై, కోయంబత్తూర్ వంటి జిల్లాలు భారీ వర్షాలతో సతమతమౌతున్నాయి. కేరళలోనూ ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి.

English summary
Karnataka: Around 3.50 am today, 5 coaches of Kannur-Bengaluru Express derailed b/w Toppuru-Sivadi of Bengaluru Division,due sudden falling of boulders on the train. All 2348 passengers on board are safe, no casualty/injury reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X