కర్ణాటక ఎన్నికల పోలింగ్ : షాకింగ్ వీడియోతో బీజేపీని టార్గెట్ చేసిన డీకే శివకుమార్ !!

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్ణాటక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రచార సమయంలోనే కాకుండా ఓటింగ్ రోజున కూడా బీజేపీని టార్గెట్ చేయడానికి ఉన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ధరల పెరుగుదల,ద్రవ్యోల్బణం సమస్యలపై బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పదే పదే సూచిస్తుంది.

ఈ సారి అధికారం తమ హస్తగతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ఇక నేడు పోలింగ్ జరుగుతుండగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్ని పార్టీల నేతలు పిలుపునిస్తున్నారు.

Karnataka assembly election 2023: DK Shivakumar Targets BJP

ఇక బీజేపీపై తీవ్ర విమర్శలు చెయ్యటంలో ఏ మాత్రం తగ్గని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకపుర అభ్యర్థి డీకే శివకుమార్ నేడు వంట గ్యాస్ సిలిండర్ కు పూజ చేసి హారతి ఇచ్చి, ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలపై, ద్రవ్యోల్బణ సమస్యలపై బీజేపీపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వంట గ్యాస్ ధరల విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడానికి, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించేలా,వంట గ్యాస్ సిలిండర్ కు పూజచేసి, హారతి ఇచ్చారు. ఇక వీడియోతో పాటు కన్నడిగులారా.. మీరు ఓటు వేయడానికి వెళ్లేముందు, ఈ పనిచేయడం మరిచిపోవద్దు అంటూ, ప్రతి ఒక్కరూ వీడియోను చూడాలని క్యాప్షన్ పెట్టారు.

మరి డీకే శివకుమార్ పోస్టు చేసిన ఈ వీడియో ఓటర్ల మనసుపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రయత్నం కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా మారుతుందా? అనేది మే 13 న వెలువడనున్న ఎన్నికల ఫలితాలలో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+