మైండ్ బ్లాక్, బెంగళూరు స్లమ్ ల్లో రూ. 20 కోట్ల డ్రగ్స్ సీజ్, అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కావడానికి కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం సోమవారం సాయంత్రం నుంచి మద్యం విక్రయాలు బంద్ అయ్యాయి. ఇలాంటి సమయంలో బెంగళూరులో రూ. 20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మూడు రోజులు, ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా మరో రోజు మద్యం విక్రయాలు పూర్తిగా బంద్ కావడంతో యువత మత్తులో ఊగడానికి డ్రగ్స్ మీద ఆదారపడుతారని డ్రగ్స్ డీలర్స్ పసిగట్టారు. బెంగళూరు నగరంలోని యువతను టార్గెట్ చేసుకున్న డ్రగ్స్ డీలర్స్ భారీ మొత్తంలో బెంగళూరులో డ్రగ్స్ నిల్వ చెయ్యాలని ప్లాన్ చేశారు.

seizedrs20croreworthofdrugs

అనుకున్నట్లుగానే డ్రగ్స్ డీలర్స్ కొంతకాలం క్రితం నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చెయ్యడం మొదలుపెట్టారని బెంగళూరు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. కొన్ని రోజుల నుంచి డ్రగ్స్ డీలర్లు, డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా మీద నిఘా వేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుల గురించి పూర్తి సమాచారం సేకరించారు.

డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న 19 మంది పెడ్లర్ లను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారణ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం అందింది. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏకంగా రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

drugs

మద్యం విక్రయాలు బంద్ కావడంతో నిందితులు గంజాయితో పాటు కోకైన్, ఎల్ ఎస్ డీ, ఎండీఎంఏ, ఆశిస్ అయిల్ విక్రయించడానికి సిద్దం అయ్యారని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని మురికివాడల్లో రూ. 20 కోట్ల డ్రగ్స్ దాచిపెట్టిన నిందితులు పోలీసులకు అనుమానం రాకుండా విక్రయించడానికి ప్రయత్నించారని పోలీసు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని ఆర్ టీ నగర్, కేఆర్ పురం, అశోక్ నగర్, సిద్దాపుర, పులకేశీనగర్, యలహంక, హెణ్ణూరు, బాణసవాడి, విల్సన్ గార్డెన్ ప్రాంతాల్లోని మురికివాడల్లో డ్రగ్స్ నిల్వ చేశారని సమాచారం అందడంతో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు. డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+