రాహుల్ గాందీ డ్రగ్స్ బానిస, వ్యాపారి-కర్నాటక బీజేపీ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న డ్రగ్ కల్చర్ పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్నాటక బీజేపీ ఛీఫ్ నలిన్ కుమార్ నోరు పారేసుకున్నారు. రాహుల్ ను ఉద్దేశించి ఇవాళ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఓ డ్రగ్ ఎడిక్ట్ అని, వ్యాపారి అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
రాహుల్ గాంధీ ఎవరు, ఇది నేను చెప్పడం లేదు, రాహుల్ గాంధీ ఓ డ్రగ్ బానిస, డ్రగ్ వ్యాపారి. నువ్వు పార్టీని కూడా నడిపించలేవు. ఇది మీడియాలో కూడా వచ్చిందంటూ కర్నాటక బీజేపీ ఛీఫ్ నలిన్ కుమార్ రెచ్చిపోయారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తాజాగా ప్రధాని మోడీ నిరక్షరాస్యుడంటూ ఓ ట్వీట్ వచ్చింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కర్నాటక కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ప్రధానిపై వచ్చిన ట్వీట్ ను తొలగిస్తున్నట్లు పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఈ కామెంట్స్ చేశారు.

నళిన్ కుమార్ కటీల్ వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ ట్విట్టర్‌లో బీజేపీ ఛీఫ్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ ఛీఫ్ శివకుమార్.. తన ట్వీట్ లో, "నిన్న నేను రాజకీయాల్లో పౌరులుగా మరియు మా ప్రత్యర్థులకు కూడా గౌరవంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. బిజెపి నాతో ఏకీభవిస్తుందని నేను ఆశిస్తున్నాను మరియు శ్రీ రాహుల్ గాంధీపై తమ రాష్ట్ర అధ్యక్షుడి దూషణ, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ వ్యవహారం మాటల దుమారానికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications