బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM: మాకు క్లారిటీ ఉంది, పక్క రాష్ట్రం వాళ్లు మా జోలికి వస్తే ఈ సారి సినిమా చూపిస్తాం, సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక సరిహద్దు వివాదంలో మేము క్లియర్ గా ఉన్నామని, మారాష్ట్రంలోని ఒక ఇంచి భూమిని కూడా మేము వదులుకోమని, ఈ సారి మాజోలికి వస్తే ఈసారి కచ్చితంగా సినిమా చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తేల్చి చెప్పారు. మహాజన్ నివేదిక అంతిమం, సరిహద్దు వివాదంలో మహాజన్ నివేదిక అంతిమనిర్ణయం, ఆ నివేదిక ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటామని, పక్కరాష్ట్రం కూడా మహాజన్ నివేదికకు కట్టుబడి ఉండాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. కర్ణాటక సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కోసం మేము ఎదురు చూస్తున్నామని సీఎం బసవరాజ్ అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

lady: ఫైవ్ స్టార్ హోటల్ లో నగ్నంగా బయటకు వచ్చిన విదేశీ మహిళ, జుట్టుపట్టుకుని చితకబాదేసి ?lady: ఫైవ్ స్టార్ హోటల్ లో నగ్నంగా బయటకు వచ్చిన విదేశీ మహిళ, జుట్టుపట్టుకుని చితకబాదేసి ?

 బెళగావి కర్ణాటకదే

బెళగావి కర్ణాటకదే

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి విషయంలో రెండు రాష్ట్రాల పోట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. బెళగావి మాదే అంటూ మహారాష్ట్ర మంత్రులు, నాయకులు ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి సరిహద్దు వివాదంలో ఇప్పటికే మహాజన్ నివేదిక ఇచ్చింది. బెళగావి కర్ణాటకదే అంటూ మహాజన్ నివేదిక ఇచ్చిందని కర్ణాటక ప్రభుత్వం అంటోంది.

 మేము క్లారిటీతో ఉన్నాము.... మీరు సహకరించండి

మేము క్లారిటీతో ఉన్నాము.... మీరు సహకరించండి

కర్ణాటక సరిహద్దు వివాదంలో మేము క్లియర్ గా ఉన్నామని, మారాష్ట్రంలోని ఒక ఇంచి భూమిని కూడా మేము వదులుకోమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తేల్చి చెప్పారు. మహాజన్ నివేదిక అంతిమం, మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో మహాజన్ నివేదిక అంతిమనిర్ణయం కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

 ఏక్ నాథ్ షిండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము

ఏక్ నాథ్ షిండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము

ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తాను, అధికారులు సమావేశం అయ్యామని, ఆ సందర్బంలో ఏక్ నాథ్ షిండే అడిగిన ప్రశ్నలకు తాను ధీటుగా సమాధానం ఇచ్చానని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. అమిత్ షా ఓ పెద్దగా, కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా ఇద్దరు సీఎంలను పిలిచి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య దీనిని రాజకీయం చేస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

 అందరి మద్దతు అవసరం

అందరి మద్దతు అవసరం

బుధవారం బెళగావిలో జరుగుతున్న శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఈ బిల్లుకు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ప్రకటించాలని కర్ణాట సీఎం బసవరాజ్ బోమ్మయ్ మనవి చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కూగా బెళగావి సరిహద్దు వివాదంపై ప్రవేశపెట్టే బిల్లకు మద్దతు ప్రకటించాలని, అప్పుడే మనం అందరూ కలసి ఉన్నామని మహారాష్ట్ర నాయకులకు తెలుస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

 ఈసారి వస్తే సినిమా చూపిస్తాము

ఈసారి వస్తే సినిమా చూపిస్తాము

ఇటీవల మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ బెళగావి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన బెళగావికి వచ్చిన సమయంలో ఎవరి ఇంట్లో ఉన్నారో మాకు బాగా తెలుసని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇంకోసారి మహారాష్ట్ర మంత్రులు, నాయకులు బెళగావి వచ్చి ఆ ప్రాంతం మాదే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టినా కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అరెస్టు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మహారాష్ట్ర నాయకులను హెచ్చరించారు.

English summary
Karnataka CM Basavaraj Bommay said Mahajan's report is final in Belagavi border dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X