మంత్రులకు ప్రమోషన్ ఇచ్చిన సీఎం, మిగతవాళ్లు చేతకాని వాళ్లా? అని ప్రశ్నించిన ప్రతిపక్షం, మ్యాటర్!

లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్నిసీట్లు వస్తాయి అంటూ అప్పుడే లెక్కలు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని సీఎంలకు, మంత్రులకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టాస్క్ ఇచ్చింది. అయితే ఇటీవల విడుదల అవుతున్న సర్వేల ప్రకారం నరేందర మోదీ మరోసారి ప్రధాని కావడంలో ఎలాంటి సందేహం లేదని వెలుగు చూస్తోంది.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, పనితీరు, ప్రణాళికలను ప్రజలకు తెలియజేయడానికి ఐదుగురు ప్రభావవంతమైన మంత్రులను ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా నియమిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

Karnataka CM Siddaramaiah has appointed five ministers as government representatives

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దినేష్ గుండూరావు, రెవెన్యూ శాఖా మంత్రి కృష్ణ బైరేగౌడ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఐటీ శాఖా, బయోటెక్నాలజీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖార్గే, అటవీ శాఖ, పర్యావరణ శాఖా మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే, కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ లను కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకుగా నియమితులయ్యారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఐదుగురు మంత్రులను నియమించడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ విజయాలు, వాటిని తెలియజేప్పే సంబంధిత పత్రాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంత్రులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖాధిపతులకు సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా నియమితులైన ఈ ఐదు మంది మంత్రులు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సాధించిన విజయాలను సమర్థవంతంగా అందజేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉందని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

Karnataka CM Siddaramaiah has appointed five ministers as government representatives

కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఐదుగురు మంత్రులను అధికార ప్రతినిధులుగా నియమించడంపై కర్ణాటక శాసనపభలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఆర్. అశోక్ మండిపడ్డారు. కేబినెట్‌లోని 34 మంది మంత్రుల్లో కేవలం 5 మంది మంత్రులే ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఉన్నారని, మిగిలిన మంత్రులు ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించే అసమర్థులేనని సీఎం సిద్ధరామయ్య అభిప్రాయమా? అని ఆర్. అశోక్ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఐదు మంది మంత్రుల ఈ జాబితాలో ఉన్న ఒక మంత్రి మహాశయుడు, ఆయన ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టాడని, విధానసౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో మీడియాపై తప్పుడు ఆరోపణలు చేసి, మీడియాను పదే పదే దుర్భాషలాడుతూ నిజాన్ని వక్రీకరించాడని, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన మంత్రి ప్రియాంక్ ఖార్గేకు సిద్ధరామయ్య ఇస్తున్న బహుమానం ఇదేనా? అని బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+