Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్విచ్ వేసిన సిద్ధరామయ్య: మరో ఫ్రీ స్కీమ్ అమలు

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది- ఎన్నికల మేనిఫెస్టో. ఇందులో పొందుపరిచిన అయిదు ఉచిత హామీలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. హామీలను ఇవ్వడం వరకే పరిమితం కాలేదు కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వాటి అమలుకు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే దీన్ని అమలు చేసింది. ఈ పథకం వల్ల నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.

siddaramaiahlaunchedthegruhajyothischeme1

ఇక తాజాగా మరో ఉచిత పథకం అమల్లోకి వచ్చింది. అదే గృహ జ్యోతి స్కీమ్. జూలై 1వ తేదీన గృహావసర వినియోగదారులకు 200 యూనట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతిని అమల్లోకి తీసుకుని వచ్చింది. జూలైలో వినియోగించిన విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడాన్ని లాంఛనంగా ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ.

గృహావసర వినియోగదారులు 200 యూనిట్ల కంటే తక్కువగా వినియోగించిన విద్యుత్‌కు చెల్లించాల్సిన నెలవారీ బిల్లును ఆగస్టు నెలలో మాఫీ చేసింది. ఈ నెల బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసింది. జూలైలో ఒక్కో వినియోగదారుడు ఎంత విద్యుత్‌ను వినియోగించారు? దానికి చెల్లించాల్సిన బిల్లు ఎంత?.. గృహ జ్యోతి పథకం కింద ఎంత మొత్తాన్ని మాఫీ అయింది? అనే విషయాలను పొందుపరిచింది.

siddaramaiahlaunchedthegruhajyothischeme1

ఈ గృహ జ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. కలబురగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పథకం ప్రారంభానికి సూచికగా సిద్ధరామయ్య స్విచ్ వేసి, బల్బును వెలిగించారు.

అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షమేనని మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలపై ఎన్నోరకాలుగా మోయలేని భారం మోపిందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+