సీఎం కారుపై 7 ట్రాఫిక్ చలాన్లు- 50 శాతం డిస్కౌంట్ స్కీంలో సెటిల్..!

ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో తాను ప్రయాణిస్తున్న కారుపై 7 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేయకుండా అలాగే ప్రయాణాలు సాగించేస్తున్నారు. చివరికి ఓ రోజు తన ప్రభుత్వమే భారీగా పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు ఆయన తన కారుపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలని నిర్ణయించారు. వెంటనే అధికారులకు చెప్పి ఆ మొత్తం క్లియర్ చేసి సెటిల్ చేసుకున్నారు.

ఇంతకీ ఆయనెవరో తెలుసా ? కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద
ఉన్న నిఘా కెమెరాలు ముఖ్యమంత్రి టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన బహుళ ఉల్లంఘనలను నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ఉల్లంఘనలలో జనవరి ,ఆగస్టు 2024 మధ్య ఆరు సీట్‌బెల్ట్ ధరించని సందర్భాలు ,ఒక అతివేగంగా వాహనం నడిపిన కేసు ఉన్నాయి. ప్రతి సీట్‌బెల్ట్ ఉల్లంఘనలోనూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణీకుల సీటులో ప్రయాణిస్తున్నట్లు వారు గుర్తించారు. తాజా ఉల్లంఘన ఆగస్టులో నమోదైంది.

Karnataka CM Siddaramaiah Pays 7 Traffic Fines Under 50 Discount Scheme

రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును పొందిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని జరిమానాలను
చెల్లించి సెటిల్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.2500 చెల్లించి ఇలా ఏడు చలానాలను క్లియర్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ పై ట్రాఫిక్ చలానాల చెల్లింపు పథకం రాష్ట్రమంతా అమల్లో ఉంది. ఇందులో భాగంగా సీఎం కారు అనే ప్రత్యేక డిస్కౌంట్ లేవీ లేకుండా సాధారణంగా వీటిని క్లియర్ చేసినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ డివిజన్ సీనియర్ అధికారి తెలిపారు.

Karnataka CM Siddaramaiah Pays 7 Traffic Fines Under 50 Discount Scheme

కర్నాటక వ్యాప్తంగా ఈ ఆఫర్ ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 12 వరకు అమల్లో ఉంటుంది. 2019 -2025 మధ్య నగరంలో 3 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు పెండింగ్‌లో ఉన్నాయని తేల్చారు. వీటి విలువ రూ.1000 కోట్లు. ఈ శనివారానికి మొత్తం 16.21 లక్షల కేసుల్ని పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. వీటి ద్వారా మొత్తం రూ.45.52 కోట్లకు పైగా వసూలైనట్లు ప్రకటించారు. ఇందులో పలు రాజకీయ నాయకుల కార్లు, ఇతర వాహనాలవి కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+