బీజేపీకి భారీ దెబ్బ: సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గాలి, ఎంపీ శ్రీరాములు శిష్యుడు!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బళ్లారి జిల్లాలో బీజేపీకి భారీ దెబ్బపడింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు ప్రియ శిష్యుడిగా ఇంత కాలం గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులతో కలిసి బుధవారం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సీఎం స్వాగతం
సామూజిక న్యాయం, సోదరతత్వం ఉన్న వారు ఎవ్వరూ బీజేపీలో ఇమడలేరని, అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. బీజేపీ సిద్దాంతాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చే వారికి తాము ఎప్పుడూ స్వాగతం చెబుతామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
Recommended Video


బీజేపీ ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు
ఆనంద్ సింగ్ మాత్రమే కాదు, బీజేపీ శాసన సభ్యులు చాల మంది త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ బాంబుపేల్చారు. బీజేపీ నుంచి వలస వచ్చే శాసన సభ్యుల జాబితా తమ దగ్గర ఉందని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో సమస్యలు
బళ్లారి జిల్లా బీజేపీ నాయకుల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఒక్కరూ తనను పిలిపించి మాట్లాడలేదని, అందుకే ఆ పార్టీలో ఇమడలేక తాను గత శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆనంద్ సింగ్ చెప్పారు.

గాలి, శ్రీరాములు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ శ్రీరాములకు ప్రధాన అనుచరుడు అయిన ఆనంద్ సింగ్ బీజేపీని నమ్ముకునే ఇంతకాలం ఉన్నారు. శ్రీరాములు బీజేపీ నుంచి బయటకు వచ్చి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సమయంలో ఆనంద్ సింగ్ మాత్రం ఆ పార్టీ నుంచి బయటకు రాలేదు.

బీజేపీ క్లీన్
ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బళ్లారి జిల్లా హోస్ పేట నియోజక వర్గంలోని బీజేపీ కార్యకర్తలు దాదాపు ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. హోస్ పేట్ నియోజక వర్గంలో ఆనంద్ సింగ్ కుటుంబ సభ్యులే బీజేపీలో కీలిక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పదవులు మొత్తం ఖాళీ అయ్యాయి.












Click it and Unblock the Notifications