13 ఏళ్ల తర్వాత మోదీ టీమ్ లోకి గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ కింగ్ సొంత పార్టీ బీజేపీలో విలీనం !
కేఆర్‌పీపీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి సోమవారం బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర సమక్షంలో బీజేపీలో అధికారికంగా చేరారు. గాలి జనార్దన్ రెడ్డి వెంట ఆయన భార్య గాలి లక్ష్మీ అరుణ కూడా ఉన్నారు.
ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆయన సొంత పార్టీ కేఆర్పీపీ పార్టీని కూడా బీజేపీలో అధికారికంగా విలీనం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి అనుకోని పరిస్థితుల కారణంగా తాను ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని, గతంలో జరిగిపోయిన పీడకలల గురించి తాను మరిచిపోయానని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తాను మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్రతో కలసి తాను బీజేపీ సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని, తాను బీజేపీలో చేరడం మళ్లీ అమ్మ ఒడిలోకి వచ్చినట్లే అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ బీజేపీలో విలీనమవుతోందని, నా కష్టకాలంలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన కేఆర్ పీపీ కార్యకర్తలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, మేము అందరం కలిసి బీజేపీలో చేరామని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.
దేశ సర్వతోముఖాభివృద్ధికి, విశ్వగురువు పాత్రకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల తనను ఢిల్లీకి తనను ఆహ్వానించారని, బయటి నుంచి మద్దతు ఇవ్వాలని, లేదా బీజేపీలోకి రావాలని ఆయన నన్ను ఆహ్వానించారని, ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇదే నా జన్మ పుణ్యం అని తాను అప్పుడే అమిత్ షాకు చెప్పానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఈరోజు ఇక్కడికి వచ్చారని, అతి చిన్న వయసులోనే తాను బీజేపీలో పని చేసేందుకు ఆయన తనకు చక్కటి అవకాశం ఇచ్చారని, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో పనిచేసేందుకు తనకు చక్కటి అవకాశం ఇచ్చారని, నేడు ఆయన కుమారుడు విజయేంద్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని, మళ్లీ వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

నేను కొన్ని కారణాల వల్ల బీజేపీ నుంచి బయటకు వెళ్ళానని, 13 ఏళ్ల తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చినట్లు అనిపించడం లేదని, ఉదయం వెళ్లి మధ్యాహ్నం తిరిగి వచ్చినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు అందరూ సోమవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఈ సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు ఆయన వెంట ఉన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications