స్నేహితుడి భార్య మీద రేప్, బీజేపీ మాజీ మంత్రిపై కేసు: విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హరతాళు హాలప్ప మంగళవారం శివమొగ్గ జిల్లా రెండవ సెషన్స్ కోర్టు ముందు హాజరైనారు. కేసు తుది విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు.

కేసు విచారణ పూర్తి అయ్యిందని, ఆగస్టు 17వ తేదీ తీర్పు చెబుతామని న్యాయమూర్తి చెప్పారు. కోర్టు బయటకు వచ్చిన హరతాళు హాలప్ప కేసు విషయంపై మీడియాతో మాట్లాడటానికి నిరకరించి అక్కడి నుంచి మౌనంగా తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు.

Karnataka former minister Haratal Halappa case district court reserves order Aug 17

2009లో బీఎస్. యడ్యూరప్ప మంత్రి వర్గంలో హరతాళు హాలప్ప మంత్రిగా పని చేశారు. 2009 నవంబర్ 26వ తేదీన స్నేహితుడి ఇంటికి వెళ్లిన హరతాళు హాలప్ప రాత్రి అక్కడే ఉన్నారు. తరువాత స్నేహితుడి ఇంటిలోనే ఆయన భార్య మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు రావడంతో హరతాళు హాలప్ప మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు కేసు విచారణ చేసి న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు. హైదరాబాద్ లోని ల్యాబ్ లో రెండు సార్లు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. మహిళ మీద అత్యాచారం జరిగిందని హైదరాబాద్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. మంగళవారం విచారణ పూర్తి కావడంతో ఆగస్టు 17 వ తేదీ వరకు తీర్పు కోసం ఎదురు చూడవలసి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rape case on Ex Minister Haratal Halappa, district court reserved its final verdict for Aug 17. The charges against him include rape, intimidation, and unlawful restraint and confinement. Halappa has denied the charges, accusing his political rivals of trying to malign him.
Please Wait while comments are loading...