CD Case: మాజీ మంత్రికి రిలీఫ్, ఇద్దరూ మేజర్లు, ఫోన్లలో అమ్మాయితో ఆ చర్చ జరిగింది ?, కోర్టులో నివేదిక !
బెంగళూరు: పెళ్లికాని అమ్మాయితో రాసలీలలు సాగించాడని ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారని తెలిసింది. రాసలీలల సీడీ కేసు విచారణ చేసిన ఎస్ఐటీ అధికారులు సీల్డ్ కవర్ లో శుక్రవారం ఫైనల్ రిపోర్టు సమర్పించారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసు పెట్టింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టిన యువతి ఇద్దరూ మేజర్లు అని, పరస్పరం అంగీకారంతోనే శారీరకంగా కలిశారని,యువతిని బెదిరించినట్లు ప్రాథమికంగా ఎలాంటి సాక్షాలు లేవని ఎస్ఐటీ అధికారులు నివేదిక సమర్పించారని తెలిసింది. చాలాకాలం మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఆ యువతి ఫోన్లలో మాట్లాడుకున్నారని, ఇద్దరి మద్య శారీరక సంబంధం గురించి చర్చ జరిగిందని, ఎక్కడా బెదిరింపులు చేసినట్లు ఆధారాలు లేవని ఎస్ఐటీ అధికారులు నివేదిక సమర్పించారని తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐటీ విచారణ అధికారి, ఏసీపీ కవితా సంతకం చేసిన 150 పేజీల తుది నివేదిక శుక్రవారం బెంగళూరులోని ఏసీఎంఎం న్యాయస్థానంలో సమర్పించారు.

మంత్రి పదవికి రాజీనామా
బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోని పీజీలో నివాసం ఉంటున్న ఓ యువతి తన మీద బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఫ్లాట్ కు పిలిపించుకుని అత్యాచారం చేశారని గత సంవత్సరం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కేసు పెట్టడంతో అప్పట్లో రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కర్ణాటకను కుదిపేసింది
తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీద ఆమె కేసు పెట్టడంతో కర్ణాటకలో కలకలం రేపింది. ఈ కేసు విచారణ గత ఏడాది నుంచి ఎస్ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ఊపిరిపీల్చుకున్న మాజీ మంత్రి రమేష్ జారకిహోళి
పెళ్లికాని అమ్మాయితో రాసలీలలు సాగించాడని ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారికి హోళి ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారని తెలిసింది. రాసలీలల సీడీ కేసు విచారణ చేసిన ఎస్ఐటీ అధికారులు సీల్డ్ కవర్ లో శుక్రవారం కోర్టులో ఫైనల్ రిపోర్టు సమర్పించారు.

ఇద్దరు మేజర్లు..... ఫోన్లలో ఆ చర్చ జరిగింది ?
బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, కేసు పెట్టిన యువతి ఇద్దరూ మేజర్లు అని, పరస్పరం అంగీకారంతోనే శారీరకంగా కలిశారని, యువతిని బెదిరించినట్లు ప్రాథమికంగా ఎలాంటి సాక్షాలు లేవని ఎస్ఐటీ అధికారులు నివేదిక సమర్పించారని తెలిసింది. చాలాకాలం మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, ఆ యువతి ఫోన్లలో మాట్లాడుకున్నారని, ఇద్దరి మద్య శారీరక సంబంధం గురించి చర్చ జరిగిందని, ఎక్కడా రమేష్ జారకిహోళి ఆమెను బెదిరింపులకు గురి చేసినట్లు ఆధారాలు లేవని ఎస్ఐటీ అధికారులు కోర్టులో తుదినివేదిక సమర్పించారని తెలిసింది.

హైకోర్టు ఆదేశాలతో ఎస్ఐటీ తుది నివేదిక
హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐటీ విచారణ అధికారి, ఏసీపీ కవితా సంతకం చేసిన 150 పేజీల తుది నివేదిక శుక్రవారం బెంగళూరులోని ఏసీఎంఎం న్యాయస్థానంలో సమర్పించారు. మొత్తం మీద రాసలీలల సీడీ వ్యవహారంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఇప్పుడు రాసలీలల సీడీ కేసులో కొంచెం ఊపిరిపీల్చుకున్నారని కన్నడ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications