బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

New Year: ఫేమస్ నందీ హిల్స్, ఆంధ్రా, బెంగళూరు ప్రజలకు బ్యాడ్ న్యూస్, పార్టీలు బ్యాన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కబళ్లాపురం: నూతన సంవత్సర వేడుకల కోసం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ లోకి వెళ్లి సంబరాలు చేసుకోవాలని ఎదురూ చూసిన వారిని బ్యాడ్ న్యూస్ వచ్చింది. నంది హిల్స్ లో న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తూ చిక్కబళ్లాపూరం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నంది హిల్స్ వెళ్లాలని ఇన్ని రోజులు ఆలోచించిన ఆంధ్రా, బెంగళూరు ప్రజల కోరికకు చెక్ పడింది.

కర్ణాటకలో ఎంతో పేరు ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన నంది హిల్ బెంగళూరు సిటీకి 70 కిలోమీట దూరంలో ఉంది. నంది హిల్స్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిరోజు వేలాది మంది వచ్చి వెలుతుంటారు. ఇప్పుడు నంది హిల్స్ లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు నంది హిల్స్ లో ఈ ఆంక్ష అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎన్‌ఎం, నాగరాజ్‌ శుక్రవారం తెలిపారు.

Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !

ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, నిబంధనల ఉల్లంఘన, ఇన్ఫెక్షన్ పెరగకూడదనే ఉద్దేశ్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రజలు నంది హిల్స్ లో ప్రవేశించకుండా నిషేధం విధించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Karnataka Government bans New Year celebrations 2023 in Nandi Hills near Bengaluru.

నంది హిల్స్ లో జనవరి 1 న్యూఇయర్ వేడుకలకు ముందు రోజు డిసెంబర్ 31న రూమ్ బుకింగ్ చేయనున్నారు. కానీ ఈసారి అవి రద్దు చేయబడింది. నంది హిల్స్ కొండ చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నంది హిల్స్ లో ప్ర‌జ‌లు రాత్రి పూట డ్యాన్స్‌లు చేస్తూ, మద్యం సేవిస్తూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించాలని ప్లాన్ చేసుకున్నారు.

Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !

చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య భారత్‌లో ఎక్కువ అయ్యింది. దీని ప్రభావం కర్ణాటకపై ఉంది. ప్రధానంగా బెంగళూరులో కూడా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది నంది హిల్స్ లో న్యూఇయరక వేడుకలకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. మునుపటిలా, కోవిడ్ భయం కారణంగా, పార్టీ హోటళ్లు, రిసార్ట్‌లు మరియు ఇతర రద్దీ ప్రాంతాలలో ప్రభుత్వం నిబంధనలను విధించింది.

నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, హోమ్ స్టేలకు న్యూఇయర్ రూల్స్ మారిపోయాయి. కొన్ని చోట్ల వారాలు ముందే గదులు బుక్ చేస్తారు. నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే వేడుకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. నియమావళిని ఉల్లంఘిస్తే అలాంటి వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చిక్కబల్లాఫుర ఎస్పీ డి.ఎల్. నగేష్ శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు.

English summary
Karnataka Government bans New Year celebrations 2023 in Nandi Hills near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X