కొరత వేళ గ్యాస్ బుకింగ్‌లపై కొత్త పరిమితి, ఇక నుంచి...!!
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు వంట గ్యాస్ కొరత లేదని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసిన మూడు వారాలకు డెలివరీ అవుతోంది. దీంతో.. వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. అటు కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హెటల్ రంగం దెబ్బ తింది. గ్యాస్ బుకింగ్ విషయం లో మరోసారి మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సమస్య లేదని చెబుతున్నా... వంట గ్యాస్ పంపిణీలో ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ బుకింగ్ చేసిన మూడు వారాలకు పంపిణీ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులకు మెసేజ్ లు వచ్చినా... డెలివరీ ఆలస్యం అవుతోంది. దీంతో.. గోడౌన్ల వద్దకు వెళ్లి వ్యయ ప్రయాసాలకు ఓర్చి స్వయంగా తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ కోసం డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు.. గ్రామీణీ ప్రాంతాల్లో 35 రోజులు లాకింగ్ పిరీయడ్ అమలు చేస్తున్నారు. కాగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 26 రోజులుగా ఖరారు చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వంట గ్యాస్ కొరత కారణంగా బెంగళూరులో పలు హోటళ్లను మూసివేసారు.

26 రోజులకు బుకింగ్ పరిమితి మార్పు
బెంగళూరులో గ్యాస్ కొరత, ఆటో ఎల్‌పిజి క్యూలు పెరగడం, రీఫిల్‌లలో ఆలస్యం వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 14.2 కిలోలతో పాటు 10 కిలోల, 5 కిలోల గృహ సిలిండర్లను తిరిగి బుక్ చేసుకోవాలంటే కనీసం 26 రోజుల వ్యవధి తప్పనిసరి. ముఖ్యంగా ఈ కాలాన్ని బుకింగ్ తేదీ నుంచి కాకుండా, సిలిండర్ డెలివరీ సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సమయం నుంచి ఈ బుకింగ్ గడువు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే కొరత తో పాటుగా బుకింగ్ సమయంలో చాలా మంది వినియోగదారులు బుకింగ్ సమయంలో రీఫిల్ నాట్ అలౌడ్ లేదా టెక్నికల్ ఎర్రర్ వంటి సందే శాలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌పిజి బంక్‌ల వద్ద భారీ క్యూలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిపై కర్ణాటక మంత్రులు కృష్ణ బైరే గౌడ, దినేష్ గౌడ రావు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సమస్య ఎన్ని రోజులు కొనసాగుతుందనే ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications