సీరియల్ కిల్లర్, వరుస అత్యాచారాల శాడిస్టు ఉమేష్ రెడ్డికి హైకోర్టులో షాక్, వీడికి పెరోల్ ఇస్తే!
మహిళలపై వరుస అత్యాచారాలు చేసి చివరికి వారిని దారుణంగా హత్య చేశాడు. సీరియల్ హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నరరూప రాక్షసుడు ఉమేష్ రెడ్డికి పెరోల్ ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన వృద్ధ తల్లిని ఆదుకునేందుకు, శిథిలావస్థకు చేరిన ఇంటిని బాగు చేసేందుకు 30 రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని ఉమేష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం తోసిపుచ్చింది.
జీవిత ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. జైలు అధికారులు సమర్పించిన పత్రాల ప్రకారం నరరూప రాక్షసుడు ఉమేష్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే పాత పగలతో పిటిషనర్ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, అతనికి పాత పగ కూడా గుర్తుండవచ్చు అని, అతను కూడా నేరాలు చేసి సాక్షులకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని కోర్టుకు మనవి చేశారు.

పిటిషనర్ ఉమేష్ తల్లిని అతని ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారని, శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూడా ఉమేష్ రెడ్డి రిపేర్ చేసుకుని దానిని బాగుచేసే పనిని చూసుకుంటారని జైలు అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. పెరోల్ మంజూరు చేయబడిన పిటిషనర్ ఉమేష్ రెడ్డి మళ్లీ నేరం చేయ్యడానికి అవకాశం ఉందని, లేదా శాంతిభద్రతలకు ముప్పు కలిగించవచ్చు అని, అందువల్ల పిటిషనర్ ఉమేష్ రెడ్డికి పెరోల్ ఇచ్చే విషయంలో మేము ఆమోదించలేమని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
1998లో మారడి సుబ్బయ్య భార్యపై అత్యాచారం చేసి తరువాత ఆమెను అతి దారుణంగా హత్య చేసిన కేసులో మాజీ కానిస్టేబుల్ ఉమేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2006లో సబార్డినేట్ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. 2009లో హైకోర్టు, 2011లో సుప్రీంకోర్టు నరహంతకుడు ఉమేష్ రెడ్డికి మరణశిక్ష విధించింది. ఉమేష్ రెడ్డి క్షమాభిక్ష పిటిషన్‌ను 2011లో కర్ణాటక గవర్నర్, ఆ తర్వాత రాష్ట్రపతి తిరస్కరించారు. 2022లో సుప్రీం కోర్టు ఉమేష్ రెడ్డి మరణశిక్షను రద్దు చేసి అతనికి పెరోల్ లేకుండా 30 సంవత్సరాల జీవిత ఖైదు విధించింది.

ఉమేష్ రెడ్డి గత 26 ఏళ్లుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అతని 84 ఏళ్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంది. చివరి రోజుల్లో తన తల్లితో కలిసి ఉండటానికి 30 రోజులు పెరోల్ ఇవ్వాలని కోరుతూ నరహంతకుడు ఉమేష్ రెడ్డి జైలు అధికారులకు వినతి పత్రం సమర్పించాడు. 30 ఏళ్ల వరకు క్షమాభిక్ష ప్రసాదించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చీఫ్ సూపరింటెండెంట్ ఉమేష్ రెడ్డి విజ్ఞప్తిని సెప్టెంబర్ 2023న తిరస్కరించారు. 23వ తేదీన తిరిగి లేఖ రాశారు. దీంతో ఉమేష్ రెడ్డి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే కర్ణాటక హైకోర్టు కూడా ఉమేష్ రెడ్డికి పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications