డీకే శివకుమార్ కు షాక్, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, సీబీఐ కేసులో ఏం జరుగుతుందో?
డీకే. శివకుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను కర్ణాటక హైకోర్టు పూర్తి చేసింది. అలాగే తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు మరికొద్ది రోజుల్లో తీర్పును ప్రకటించే అవకాశం ఉంది. ఈ దెబ్బతో డీకే శివకుమార్ కు టెన్షన్ మొదలైయ్యిందని తెలిసింది.
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వ తీసుకున్న చర్యలను కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తే డీసీఎం డీకే శివకుమార్ మళ్లీ చిక్కుల్లో పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన సీబీఐ దర్యాప్తు అనుమతులను ఉపసంహరించుకునే చర్యను కోర్టు సమర్థిస్తే ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ఊరట లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కర్ణాటక హైకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సోమశేఖర్, జస్టిస్ ఉమేష్ ఎం. అడిగ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. సీబీఐ విచారణ దాదాపు పూర్తి అయ్యింది. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయింది. ఇలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు ఆదేశాలను ఉపసంహరించుకోవడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
సీబీఐ దర్యాప్తు ఉపసంహరించుకున్న సమ్మతికి చెల్లుబాటు కాదని, అందువల్ల అనుమతిని వెనక్కి తీసుకున్న సిద్దరామయ్య ప్రభుత్వ ఆదేశాలను, ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే, సీబీఐ అధికారులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సమ్మతి రాజకీయ ప్రేరేపితమైనదని, అప్పటి ముఖ్యమంత్రి మౌఖిక ప్రకటన ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చెయ్యడానికి అనుమతి ఇచ్చారని డీకే శివకుమార్ తరపు న్యాయవాదులు వాదించారు.

అక్రమాస్తుల అభియోగాలపై దర్యాప్తు అధికారులే నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యమంత్రి, ప్రధాని చెప్పినందున ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేమని గతవారం డీకే శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టులో వాదించారు. సీబీఐ విచారణకు సమ్మతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నిబంధనలను పాటించలేదని, సమ్మతి ఇచ్చిన తర్వాత, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ కింద నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్ జారీ చేసే ముందు ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించలేదని డీకే శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.
సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించడం తప్పనిసరి అన్నారు. హైకోర్టు అరుదైన కేసుల్లో మాత్రమే ఆదేశాలు ఇవ్వగలదు. కర్ణాటకలో దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేదు. సీబీఐ విచారణకు ముందుగా కేంద్రం, తరువాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కేంద్రం అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ జరిపే అవకాశం లేదని డీకే శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ వాదించారు.
అలాగే సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. సీబీఐ ఏ దారిలోకి వెళ్లాలి?, ఎవరి ఇంటికి వెళ్లాలి? అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మిగిలిన వాటిని సీబీఐ మాత్రమే విచారిస్తోందని, అందువల్ల సీబీఐ దర్యాప్తును రద్దు చెయ్యాలని డీకే శివకుమార్ న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పుకోసం సీబీఐ అధికారులు, డీకే శివకుమార్ ఎదురు చూస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications