వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా,, ఎల్లుండి నుంచి కర్ణాటకలో కాలేజీలు స్టార్ట్..

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో హిజాబ్ వివాదం సమసిపోయింది. పరిస్థితి అదుపులోకి రావడంతో.. తిరిగి ఎప్పటిలాగే కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. 16వ తేదీ బుధవారం నుంచి కాలేజీలు తెరచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెిలపారు. పీయూసీ, డిగ్రీలు తెరచుకుంటాయని ఆయన చెప్పారు.

కాలేజీలు తెరవడానికి సంబంధించి సీఎం హోంమత్రి, విద్యాశాఖ అధికారులతో చర్చించారని తెలిపారు. కాలేజీలు తెరచుకోకముందే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంచేశారు. ఇంతకుముందు 10వ తరగతి స్కూళ్లు తెరవడంపై ఫోకస్ చేశారు. కానీ స్కూళ్లలో మత సంబంధమైన వస్తువులు ఉండరాదు అని స్పస్టంచేసింది. హిజాబ్ వివాదం చినికి చినికి గాలివాన అయ్యింది. కాలేజీలో మొదలైన గొడవ దుమారం రేపుతోంది. దీనిపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

 Karnataka hijab row: All colleges to reopen from February 16

గత నెలలో ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీకి హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను అడ్డుకోవడంతో వివాదం స్టార్ట్ అయ్యింది. పోటీగా పలువురు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో రెండు వర్గాలుగా విద్యార్థులు విడిపోయారు. ఇటు రాష్ట్రంలోని శివమొగ్గలో పరిస్థితి అదుపుతప్పడంతో 144 సెక్షన్‌ విధించి.. నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను కూడా తరలించారు.

ఇటు మండ్యలో జైశ్రీరాం అంటూ కాషాయ శాలువాలను ధరించిన విద్యార్థులు నినదిస్తున్న సమయంలో ఓ ముస్లిం విద్యార్థిని అక్కడకు హిజాబ్‌ ధరించి వచ్చింది. ఆమెను చూసిన విద్యార్థులు మరింత గట్టిగా నినదించారు. అందుకు ప్రతిగా ఆమె కూడా 'అల్లాహు అక్బర్‌' అంటూ పెద్దపెట్టున నినదించారు. ఆ సందర్భంలో టీచర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఉడుపిలోని ఎంజీఎం కళాశాల విద్యార్థులు కొందరు కాషాయ తలపాగాల్ని ధరించి కళాశాలకు రావడం విశేషం. హిజాబ్ వివాదం కర్ణాటకలో ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. శాంతంగా ఉండాలని మత పెద్దలు పిలుపును ఇస్తున్నారు.

English summary
Karnataka government has announced that all colleges that were closed due to protests over hijab issue will reopen starting from February 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X