Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

College girl: అంత రాత్రి కాలేజ్ అమ్మాయికి ఏం పని, ?, వీళ్లు నన్ను రేప్ చేస్తున్నారు, హోమ్ మంత్రి !

బెంగళూరు/ మైసూరు: మైసూరు నగరం శివార్లలోని చాముండికొండ మీద జరిగిన కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో కర్ణాటక హోమ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతరాత్రి పూట నిర్జనప్రదేశంలోకి కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు వెళ్లాలి? అలా వెళ్లకుండా ఉండాల్సింది, అలాంటి సమయంలో అందరిని ఆపడం మనకు సాధ్యం కాదని హోమ్ మంత్రి మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే కుళ్లు రాజకీయాలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద రేప్ చేస్తున్నారని హోమ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. మంత్రి పదవి కోసం లాబీలు చెయ్యడం కాదు సామి, మీకు ఇచ్చిన శాఖకు న్యాయం చెయ్యాలి, అంతే కాని ఇలా అసమర్థుడిగా మాట్లాడటం మీ సంస్కారానికి నిదర్శనం అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఆ పార్టీ నాయకులు హోమ్ మంత్రి మీద విరుచుకుపడుతున్నారు.

 మైసూరు కాలేజ్ అమ్మాయి

మైసూరు కాలేజ్ అమ్మాయి

మైసూరులోని ఓ ప్రముఖ కాలేజ్ లో చదువుకుంటున్న యువతి, ఆమె స్నేహితుడు మంగళవారం సాయంత్రం బైక్ లో చాముండికొండ మీదకు వెళ్లి అక్కడి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత బైక్ లో కొండ దిగుతున్న సమయంలో కాలేజ్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు మార్గం మద్యలో చాముండితప్ప సమీపంలోని లలితాద్రిపురంలో రోడ్డు పక్కన రాత్రి 7.30 గంటల సమయంలో నిలబడి ఉన్నారు.

 పక్కాప్లాన్ తో ప్రేమికుల మీద దాడి

పక్కాప్లాన్ తో ప్రేమికుల మీద దాడి

లలితాద్రిపురంలో ఉన్న సమయంలో ఆరు మంది కామాంధులు ఒక్కసారిగా విరుచుకుపడి కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడి మీద దాడి చేశారు. ఇద్దరినీ పుణ్యక్షేత్రం కొండ సమీపంలోని లలితాద్రిపురంలోని నిర్జనప్రదేశంలోకి లాక్కొని వెళ్లారు. అమ్మాయి స్నేహితుడిని బండరాయితో దాడి చేసి చితకబాదేశారు. తరువాత కాలేజ్ అమ్మాయిని నిర్జనప్రదేశంలోని లాక్కొని వెళ్లారు.

 గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని వార్నింగ్ లు

గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని వార్నింగ్ లు

కాలేజ్ అమ్మాయి స్నేహితుడిని అక్కడ కట్టేశారు. రాత్రి పూట జనసంచారం తక్కువగా ఉండటంతో కామంధులు రెచ్చిపోయారు. కాలేజ్ అమ్మాయి మీద ఒకరి తరువాత ఒకరు ఆరు మంది సామూహిక అత్యాచారం చేసి రాక్షసుల్లా వారి కామం తీర్చుకున్నారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా, బయట ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని ఇద్దర్నీ చంపేస్తామని బెదిరించి వార్నింగ్ ఇచ్చి వారిని ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడు మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 నిన్న హోమ్ మంత్రి ఏం చెప్పారంటే ?

నిన్న హోమ్ మంత్రి ఏం చెప్పారంటే ?

చాముండికొండ మీద కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారని తమకు సమాచారం అందిందని, బెంగళూరు నుంచి ప్రత్యేక పోలీసు అధికారులను మైసూరుకు పంపించి కేసు విచారణ చేయిస్తున్నామని, అమ్మాయి మీద రేప్ చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమని, చట్టపరంగా అందరిని శిక్షిస్తామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు.

 దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్

దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్

మైసూరు కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు కర్ణాటకను కుదిపేసింది. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగి 24 గంటలు దాటిపోయినా ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉగ్రప్ప మండిపడ్డారు. యువతి మీద రేప్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకుని ఉన్న ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకు ఏమి న్యాయం చేస్తోందని ఉగ్రప్ప తీవ్రవస్థాయిలో కర్ణాటక ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

 ఆ టైమ్ లో ఆమె అక్కడికి ఎందుకు వెళ్లింది ?

ఆ టైమ్ లో ఆమె అక్కడికి ఎందుకు వెళ్లింది ?

కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో గురువారం కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడారు. అంతరాత్రి పూట నిర్జనప్రదేశంలోకి కాలేజ్ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎందుకు వెళ్లాలి? అలా వెళ్లకుండా ఉండాల్సింది, అలాంటి సమయంలో అందరిని ఆపడం మనకు సాధ్యం కాదని హోమ్ మంత్రి మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రేప్ అక్కడ జరిగితే వీళ్లు నామీద రేప్ చేస్తున్నారు

రేప్ అక్కడ జరిగితే వీళ్లు నామీద రేప్ చేస్తున్నారు

మైసూరులో కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే కుళ్లు రాజకీయాలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద రేప్ చేస్తున్నారని బెంగళూరులో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. మంత్రి పదవి కోసం లాబీలు చెయ్యడం కాదు సామి, మీకు ఇచ్చిన శాఖకు న్యాయం చెయ్యాలి, అంతే కాని ఇలా అసమర్థుడిగా మాట్లాడటం మీ సంస్కారానికి నిదర్శనం అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఆ పార్టీ నాయకులు కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీద విరుచుకుపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+