తెలంగాణలో అదే మా బలం, బీఆర్ఎస్, బీజేపీతో భయం, మా ప్లాన్ మాకుంటుంది, అంతేగా అంతేగా !
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. కానీ కాంగ్రెస్ ను చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు భయపడుతోందని బళ్లారి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నాగేంద్ర అన్నారు. తెలంగాణలో మా ఎమ్మెల్యేలే మాకు బలం అని, అయితే బీఆర్ఎస్, బీజేపీతో భయం ఉందని కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర అన్నారు. శనివారం బళ్లారి సిటీలో మంత్రి నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. చాలా సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఏదో చేస్తారని మా ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన మా పార్టీ అభ్యర్థులు అందరితో అత్యవసరంగా చర్చలు జరిపారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన అందరూ ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవాలని ఏఐసీసీ సూచించిందని మంత్రి నాగేంద్ర చెప్పారు.

ఇవాళ సాయంత్రానికి తాను కూడా తెలంగాణలోని హైదరాబాద్ కు చేరుకోబోతున్నానని మంత్రి నాగేంద్ర తెలిపారు. మా ఎమ్మెల్యేలపై మాకు నమ్మకం ఉంది, కానీ బీజేపీ దేశంలో చెడు సంప్రదాయాన్ని ప్రారంభించింది. గెలిచేవారిని మంత్రి పదవులు ఇష్తామని, మా పార్టీలోకి రావాలని ఎంకరేజ్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని, అందుకు మన కర్ణాటక రాష్ట్రమే ఉదాహరణ అని మంత్రి నాగేంద్ర వివరించారు.
కర్ణాటక రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీజేపీ బ్యాక్ డోర్ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మంత్రి నాగేంద్ర అన్నారు. ఇది మన కళ్లముందే కర్ణాటకలో జరిగింది. అందువల్ల తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ కమల చేసే అవకాశం ఉందని, మా ఎమ్మెల్యేలను బెదిరించే అవకాశం ఉందని, అందుకే మా ఎమ్మెల్యేలను కాపాడుకోబోతున్నామని కర్ణాటక మంత్రి నాగేంద్ర మీడియాకు చెప్పారు.
తెలంగాణలో ఆపరేషన్ కమల, ఆపరేషన్ బీఆర్ చేతికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగుతారా అన్న ప్రశ్నకు మంత్రి నాగేంద్ర సమాధానం చెప్పలేదు. తెలంగాణలో ఆపరేషన్ హస్తం చేయబోమని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని వస్తే వాళ్లను రానివ్వండి అని మంత్రి నాగేంద్ర పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 60 నుంచి70 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదు. బీజేపీ, ఎంఐఎం కింగ్ మేకర్‌గా మారతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఫలితాలు తారుమారు అయితే డిసెంబర్ 3వ తేదీన గెలిచే ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్‌కు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బస చెయ్యడానికి ఇప్పటికే రిసార్టులు, హోటళ్లను సిద్ధం చేశారని సమాచారం. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలా ? వద్దా ? అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించనుంది. కొంచెం తేడాలు వస్తే గెలుపొందిన ఎమ్మెల్యేను వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించనున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ లో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ బరి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆదివారం ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు వినిపిస్తోంది. హైదరాబాద్ చేరుకున్న డీకే శివకుమార్ ఆయన మార్క్ రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications