Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్క రాష్ట్రం మంత్రుల ఎంట్రీ నిషేధం, బ్యాన్ చేసి దెబ్బకొట్టారు, అడుగుపెడితే జైల్లో పెడుతామ్ జాగ్రత్త !

బెంగళూరు/బెళగావి: నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా చాలా గ్రాండ్ గా కర్ణాటక మొత్తం కన్నడ రాజ్యత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీన కర్ణాటకలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత వైవంగా కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవం నిర్వహిస్తారు.

అలాంటి కన్నడ రాజ్యోత్సవం జరిగే నవంబర్ 1వ తేదీన బ్లాక్ డే జరుపుకునేందుకు మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES) ప్లాన్ చేసింది. బెళగావిలో బ్లాక్ డే వేడుకల్లో పాల్గొనకుండా మహారాష్ట్రాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీని అక్టోబర్ 31 తేదీ ఉదయం 6 నుండి నవంబర్ 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బెళగావి జిల్లాలోకి ప్రవేశించకుండా బెళగావి జిల్లా యంత్రాంగం నిషేధించింది.

Karnataka officials barred Maharashtra ministers from stepping foot in Belagavi district
కర్ణాటక రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తున్న ఎంఈఎస్ తన డిమాండ్‌కు మద్దతుగా కర్ణాటక రాజ్యోత్సవాన్ని బ్లాక్ డేగా పాటించనుంది. ఇటీవల ఎంఈఎస్ ( MES) నాయకులు కొల్హాపూర్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలుసుకున్నారు. బెళగావిలో జరిగే బ్లాక్ డే వేడుకలలో పాల్గొనడానికి మీరు రావాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేని ఆహ్వానించారు.

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదానికి మద్దతు ఇవ్వడానికి తమ ప్రతినిధులను పంపాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకి ఎంఈఎస్ నాయకులు మనవి చేవారు. ఎంఈఎస్ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రులు శంభురాజ్ దేశాయ్, చంద్రకాంత్ పాటిల్, దీపక్ కేసరకర్, ఎంపీ దర్యాశీల్ మానేలను బెళగావిలోని ఎంఈఎస్ నాయకులు ఇప్పటికే ఆహ్వానించారు.

దీంతో శాంతిభద్రతల కాపాడటం కోసం ముగ్గురు మంత్రులు, ఎంపీల ప్రవేశంపై బెళగావి జిల్లా యంత్రాంగం సిద్దం అయ్యింది. మహారాష్ట్రాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఓ ఎంపీ బెళగావి జిల్లాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ బెళగావి జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా బెళగావిలో కన్నడ సంఘాల కార్యకర్తలతో ఎంఈఎస్ కార్యకర్తలు ఘర్షణ పడఅవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Karnataka officials barred Maharashtra ministers from stepping foot in Belagavi district

ఇది లేనిపోని సమస్యలకు దారితీసే అవకాశం ఉందని, అందువల్ల అక్టోబర్ 31 నుండి ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు మహారాష్ట్రాకు చెందిన ముుగ్గురు మంత్రులు, ఓ ఎంపీ బెళగావిలోకి రాకుండా నిషేధించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంఈఎస్ కు మద్దతుగా బెళగావి జిల్లాకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయంపై కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చెయ్యాలని కన్నడ అనుకూల సంస్థలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వానికి మనవి చేశాయి. బెళగావి నగరంతో సహా 840 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలనే పోరాటానికి ఎంఈఎస్ సంస్థ నాయకత్వం వహించింది.

దీనికి మద్దతుగా తమ ప్రభుత్వ ప్రతినిధిని బెళగావికి పంపిస్తామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. కార్యక్రమానికి హాజరుకావాలని బెళగావిలోని ఎంఈఎస్‌ నాయకులు ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కొల్హాపూర్‌లో ఇటీవల చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+