మంత్రితో పెట్టుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడికి మిఠాయి తినిపించిన పోలీసులు !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి చెందిన నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంక్ ఖార్గేపై పోటీ చేసిన బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ అలియాస్ రాథోడ్ ను బుధవారం రాత్రి కలబురగిలోని మడబుల పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు.
రాథోడ్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ కార్యకర్త దేవానంద రామచంద్ర కొరబా హత్యకేసులో నిందితులు ఆర్డీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖార్గే మద్దతుదారులని, అందుకే వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని మణికంఠ రాథోడ్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే మీద తప్పుడు సందేశాన్ని ప్రచారం చేశాడనే ఆరోపణపై బుధవారం ఓ అపార్ట్ మెంట్ లో ఉన్న మణికంఠ రాథోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం బీజేపీ నేత రాథోడ్‌ను విడుదల చేసినట్లు కలబురగి అదనపు ఎస్పీ ఎన్.శ్రీనిధి తెలియజేశారు.
బీజేపీ కార్యకర్త దేవానంద్ రామచంద్ర కొరబా హత్యకేసులో నిందితులు చిత్తాపూర్ ఎమ్మెల్యే అయిన మంత్రి ప్రియాంక్ ఖార్గే మద్దతుదారులని రాథోడ్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా నిన్న చిట్టాపూర్‌లో పోలీసులకు వ్యతిరేకంగా రాథోడ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టాలని ప్లాన్ చేశారు.

అయితే కలబురగి నుంచి చిత్తాపూర్ వెళ్లేలోపు బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు రాథోడ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మణికంఠ రాథోడ్ చిత్తాపూర్ నుంచి ప్రియాంక్ చేతిలో 14,968 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే రాథోడ్‌పై కలబురగి, యాదగిరి, విజయపుర, బాగల్‌కోట్, బీదర్ జిల్లాల్లో అనేక క్రిమినల్ కేసుల విచారణ పెండింగ్ లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications