కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాదు, హంగ్ ప్రభుత్వం వస్తుంది: పబ్లిక్ టీవీ సర్వే
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని పబ్లిక్ టీవీ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్.. ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాదని, హంగ్ అసెంబ్లీ వస్తుందని తాజా సర్వే వెల్లడించింది.
చదవండి: టీవీ5 సర్వే, కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కర్నాటక బీజేపీదే, ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.., యెడ్డీ సీఎం
కర్నాటకలో హంగ్ ప్రభుత్వం రాదని, బీజేపీ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా తమదే విజయం అంటోంది.

అసలు పేర్లతో..
సోనియా గాంధీ అసలు పేరు చాలామందికి తెలియదు. ఆమె ఇటలీకి చెందిన వారని, రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకున్నారని చాలామందికి తెలుసు. కానీ, ఆమె అసలు పేరు చాలామందికి తెలియదు. ఇప్పుడు కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ఆమె పేరును బీజేపీ తెరపైకి తెచ్చింది.
సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియో మైనో. అదే పేరుతో ఆమెను సంబోధిస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న చివరి కోటను కాపాడుకునేందుకు ఆంటోనియో మైనో కర్ణాటకకు వచ్చారని పేర్కొంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా ఇలాగే చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సన్యాసిగా మారకముందు అసలు పేరు అసయ్ బిస్త్. ఆ పేరుతో కాంగ్రెస్ ట్వీట్లు పెట్టినందునే తాము ఇలాగే చేస్తున్నామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications