టీవీ5 సర్వే, కాంగ్రెస్‌కు ఊహించని షాక్: కర్నాటక బీజేపీదే, ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.., యెడ్డీ సీఎం

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు హంగ్ వస్తాయని చెబుతుంటే, ఓ సర్వే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి. హంగ్ వస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెబుతున్నాయి.

చదవండి: అమిత్ షా, మోడీలకు సిద్ధరామయ్య ఊహించని ఝలక్, లీగల్ నోటీసులు: ఇదీ కారణం

  కర్ణాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్దుల ఆస్తుల వివరాలు తెలుసా??

  224 అసెంబ్లీ స్థానాలకు గాను కావాల్సిన 113 మేజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీకి రాదని, ఎక్కువ సీట్లు మాత్రం గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి. మేజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ సీట్లతో ముందు నిలుస్తుందని తెలిపాయి.

  చదవండి: ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే: కర్నాటకలో హంగ్, కాంగ్రెస్‌కు 97, బీజేపీకి 84, లింగాయత్‌లు బీజేపీకే

  బీజేపీకి ఆనందం, కాంగ్రెస్‌కు షాక్

  బీజేపీకి ఆనందం, కాంగ్రెస్‌కు షాక్

  అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే ఆసక్తిని రేపుతోంది. టీవీ 5 చేసిన సర్వే బీజేపీకి సంతోషాన్ని కలిగించేలా, కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో 38,400 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించారు. ఏప్రిల్ 13 నుంచి మే 6 మధ్య టీవీ 5 కన్నడ ఛానల్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని తేలింది. తాగునీరు సహా ఏ సమస్యలు తీరడం లేదని చాలామంది సర్వేలో వెల్లడించారు.

  అనూహ్యం.. కర్నాటక బీజేపీదే

  అనూహ్యం.. కర్నాటక బీజేపీదే

  వరుసగా వస్తున్న సర్వేలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రారంభంలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని సర్వేలలో తేలింది. ఏప్రిల్ నెలలో హంగ్ అని ఎక్కువ సర్వేలు చెబితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఒకటి రెండు సర్వేలు చెప్పాయి. కానీ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిస్తూ కర్నాటక బీజేపీదేనని టీవీ5 సర్వేలో తేలింది.

  మిగతా సర్వేలకు భిన్నంగా

  మిగతా సర్వేలకు భిన్నంగా

  అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని, హంగ్ వస్తుందని చెబితే ఈ సర్వే మాత్రం అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తోందని చెబుతోంది. లేదా రెండు మూడు సీట్లు మాత్రమే తగ్గవచ్చునని చెబుతోంది.

  ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

  ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. అంటే మేజిక్ ఫిగర్ దాటడం లేదా మూడు సీట్లు తక్కువ పడటం. గతకొద్ది రోజులుగా బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లుగా ఈ సర్వేను బట్టి అర్థమవుతోంది. ముఖ్యమంత్రిగా యెడ్యూరప్పకు 38.11 శాతం మంది ఓటేస్తే, సిద్ధరామయ్యకు 37.03 శాతం మంది, కుమారస్వామికి 18.33 శాతం మంది ఓటేశారు.

   కాంగ్రెస్‌కు ఊహించని షాక్

  కాంగ్రెస్‌కు ఊహించని షాక్

  కాంగ్రెస్ పార్టీకి 65-75 సీట్ల మధ్య వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 110 సీట్ల వరకు వస్తాయని ఎక్కువ సర్వేలు చెబుతున్నాయి. కానీ అంతకంటే ముప్పై నుంచి నలభై సీట్ల వరకు తక్కువ వస్తాయని తేలడం అనూహ్యమే.

  జేడీఎస్‌కు 40 వరకు సీట్లు, ఓట్ల శాతం

  జేడీఎస్‌కు 40 వరకు సీట్లు, ఓట్ల శాతం

  ఇక, జేడీఎస్ పార్టీకి 38 నుంచి 42 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఇతరులకు రెండు నుంచి ఆరు సీట్లు వస్తాయని తేలింది. ఓట్ల శాతం విషయానికి వస్తే బీజేపీకి 36-38 శాతం, కాంగ్రెస్‌కు 33-35 శాతం, జేడీఎస్‌కు 20-22 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

  మోడీ మ్యాజిక్?

  మోడీ మ్యాజిక్?

  కర్నాటక బీజేపీ వైపు తిరగడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడి సూడిగాలి పర్యటన. మోడీ వస్తే బీజేపీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు మొదటి నుంచి భావిస్తున్నారు. ఇప్పుడు అదే నిజమయిందని అంటున్నారు. ఒకవేళ పార్టీ గెలవకపోయినా కాంగ్రెస్ గెలిచినా, బీజేపీకి ఆ సీట్లు రావడానికి మోడీయే కారణమని ముందే భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా ఇచ్చే ప్రయత్నం చేసినా వారు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని తేలింది.

  జేడీఎస్ కింగ్ లేదు కింగ్ మేకర్ లేదు?

  జేడీఎస్ కింగ్ లేదు కింగ్ మేకర్ లేదు?

  ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే జేడీఎస్ ఇన్నాళ్లుగా భావిస్తున్నట్లుగా కింగ్ కాదు.. కింగ్ మేకరూ కాదని అంటున్నారు. బీజేపీకి రెండు మూడు సీట్లు తక్కువపడిదే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉంటుందని, అప్పుడు జేడీఎస్ కింగ్ మేకర్‌గా చక్రం తిప్పే అవకాశం లేకుండానే మద్దతిస్తుందా చూడాలని అంటున్నారు.

  లింగాయత్‌లకు ప్రత్యేక మతంపై

  లింగాయత్‌లకు ప్రత్యేక మతంపై

  లింగాయత్‌లను ప్రత్యేక మతంగా చేయడానన్ని 61.11 శాతం మంది వ్యతిరేకించారు. 38.89 శాతం మంది మాత్రమే దీనిని స్వాగతించారు. సిద్ధామయ్య ప్రభుత్వంతో 50.73 శాతం మంది సంతోషంగా ఉన్నారు. 49.37 శాతం మంది ఏమాత్రం సంతోషంగా లేరు.

  ప్రధానిగాను మోడీయే కావాలి

  ప్రధానిగాను మోడీయే కావాలి

  పార్టీలను పక్కన పెట్టి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల విషయంలో సంతృప్తి సరాసరి 53.6 శాతంగా ఉంది. అసంతృప్తి 46.4గా ఉంది. ప్రధానమంత్రి రేసులోను నరేంద్ర మోడీయే ఉన్నారు. కర్నాటకలో మోడీకి 55.35 శాతం మంది ఓటేస్తే, రాహుల్ గాంధీకి 44.65 శాతం మంది ఓటేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to an opinion poll conducted by Flash Team and TV 5 Kannada, 38.11 percent respondents prefer BJP's BS Yeddyurappa for the chief ministerial post, followed by CM Siddaramaiah with 37.03 per cent and former CM HD Kumaraswamy with 18. 33 percent.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X