Karnataka Results : ఆ కీలక ప్రాంతంలో మూడో స్ధానానికి బీజేపీ-కాంగ్రెస్, జేడీఎస్ దెబ్బకు..

కర్నాటక అసెంబ్లీలోని 224 సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలుగా విభజించి చూస్తే నాలుగు ప్రాంతాల్లో విపక్షకాంగ్రెస్, రెండు ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీ ఓ ప్రాంతంలో మాత్రం మూడో స్దానానికి పరిమితం అవుతోంది. అదీ కాంగ్రెస్, జేడీఎస్ లకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్ధితికి చేరిపోయింది.

కర్నాటకలోని మైసూరు ప్రాంతంలో మొత్తం 61 సీట్లున్నాయి. వీటిలో ఆరంభ రౌండ్లలో ఆధిక్యాల్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ 35 సీట్లతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రెండో స్ధానంలో జేడీఎస్ 20 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. చివరిగా అధికార బీజేపీ కేవలం 6 సీట్లకే పరిమితమవుతోంది. దీన్ని బట్టి చూస్తే మైసూరు ప్రాంతంలో ఎన్నికలు ఎలా జరిగాయో అర్ధమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా కీలకమైన ఈ ప్రాంతంలో ఆధిక్యం సాధించాల్సిందే.

Karnataka assembly elections 2023

పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు భారీగా ఉంది. గత ఎన్నికల్లో జేడీఎస్ ఈ ప్రాంతంలో గణనీయమైన స్ధానాల్ని సాధించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ పట్టు ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని బీజేపీ ఎన్నో వ్యూహాలు రచించింది. యోగీ ఆదిత్యనాథ్ వంటి స్టార్ క్యాంపెయినర్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేయించింది. కానీ అవేవీ ఫలించ లేదని తాజా ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

karnataka assembly elections 2023

పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ ఆధిపత్యానికి ఈసారి కాంగ్రెస్ గండి కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్ గాలి ప్రభావం పాత మైసూరుపైనా పడింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ తర్వాతి స్ధానంలో జేడీఎస్ నిలిచింది. బీజేపీ ఘోరంగా నాలుగు నుంచి ఆరు సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాతమైసూరు ప్రాంతంలో ఫలితాలపై బీజేపీ నేతలు అంతర్గతంగా విశ్లేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+